Durga Stalin: వివాదానికి దారితీసిన సీఎం భార్య వీడియో.. అస్సలు ఏం జరిగిందంటే..
దేవుళ్లంటే దాదాపు అందరికీ భక్తి ఉంటుంది. కొందరైతే తెల్లవారుజాము లేచింది మొదలు దేవుడి స్మరణ ప్రారంభిస్తారు. అందరికంటే దేవుడినే ఎక్కువగా కొలుస్తారు. కానీ వీపీల విషయానికొచ్చేసరికి కథ వేరేలా ఉంటుంది. ఆలయ అధికారుల నుంచి పూజరుల వరకు వీఐపీలకు తెగ మర్యాద చేస్తుంటారు. ఒక్కోసారి ఈ మర్యాదలు తీవ్ర దూమారాన్ని రేపుతాయి.

ఛత్రం
తాజాగా.. చెన్నై నగరం లోని ఓ ఆలయ వేడుకల్లో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ వర్షంలో తడవకుండా ఉండేందుకు ఆ ఆలయ గొడుగు వాడటం తీవ్ర వివాదానికి దారి తీసింది. సీఎం సతీమణి కోసం ఆలయ ఛత్రాన్ని వాడా రంటూ నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

వర్షం
అత్యంత పవిత్రమైన ఆలయ ఛత్రాన్ని దుర్గాస్టాలిన్ వర్షంలో తడవకుండా ఉండేందుకు ఉపయోగించడంపై హిందు సంఘాలు తప్పుబడుతున్నాయి. ఇది దేవాదాయ శాఖలో జరిగిన ఘోర తప్పిదమని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆరోపించారు. దీనిపై దుర్గాస్టాలిన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తిరువొత్తియూరు
ఆదివారం ఉదయం చెన్నై శివారు తిరువొత్తియూరులోని ఆలయ మాడవీధిలో త్యాగరాజ స్వామివారి ఆలయంలో ఉత్సవమూర్తి ఊరేగింపు జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు విగ్రహాన్ని ఊరేగించేందుకు ఆలయ ప్రధాన ద్వారం వెలుపలకు తీసుకొచ్చారు. అదే సమయంలో వర్షం కురుస్తుంది.

సోషల్ మీడియా
ఉత్సవమూర్తి వానలో తడవకుండా ఉండేందుకు సిబ్బంది ఛత్రంపట్టారు. అదే సమయంలో దుర్గా స్టాలిన్ ఊరేగింపు వెనుక నడచి వస్తుండగా వర్షంలో ఆమె తడవకుండా ఓ ఉద్యోగి ఆలయ ఛత్రాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సిబ్బంది వివరణ
ఈ విషయమై ఆలయ సిబ్బందిని వివరణ ఇచ్చారు. దుర్గా స్టాలిన్ వానలో తడవకుండా ఉండేందుకు ఆలయ ఛత్రాన్ని పట్టాలని అడగలేదని, ఆలయ ఉద్యోగి ఆ గొడుగును ఉత్సవమూర్తి వెనుక తీసుకెళుతుండగా ముందు వైపు ఆమె వేగంగా నడిచి వెళ్లారని వివరించారు. అయినా ఈ వివాదంపై విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications