సంప్రదాయ వస్త్రధారణతో ఇంద్రకీలాద్రికి సీఎం విజయ్..!!

తమిళనాడు సీఎం విజయ్ ఇంద్రకీలాద్రి పై అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారి ఏపీకి వచ్చిన విజయ్ కు మంత్రి నారాయణ స్వాగతం పలికారు, అక్కడ నుంచి నేరుగా ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. జగన్మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తమిళనాడు సీఎం కు ఆలయ అర్చకులు ​వేదాశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు అందజేసారు. ఆ తరువాత సీఎం చంద్రబాబుతో విజయ్ భేటీ అయ్యారు. తెలుగు గంగ నీటి వ్యవహారాల పైన చర్చలు చేయనున్నారు.

రిజర్వేషన్లతో మారిన జనసేన సీట్ల లెక్కలు - తేల్చేసిన చంద్రబాబు, పవన్ వద్దకు పల్లా..!!
రిజర్వేషన్లతో మారిన జనసేన సీట్ల లెక్కలు - తేల్చేసిన చంద్రబాబు, పవన్ వద్దకు పల్లా..!!

తమిళనాడు సీఎం విజయ్ ​సంప్రదాయ వస్త్రధారణతో కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గౌరవ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు అధికారులు సాంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ప్రధానాలయంలోకి తోడ్కొని వెళ్లారు.

Tamil Nadu CM Vijay Visits Kanaka Durga Temple in Vijayawada offers special prayers

సంప్రదాయ వస్త్రధారణతో ఆలయానికి చేరుకున్న ఆయన, క్యూలైన్లలో ఉన్న భక్తులకు చేతులెత్తి నమస్కరిస్తూ అభివాదం చేశారు. అనంతరం అంతరాలయంలో శ్రీ అమ్మవారిని దర్శించుకుని, విశేష పూజలు నిర్వహించారు. ​దర్శనానంతరం అనివేటి మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు.

స్థానిక ఎన్నికల్లో సీట్లు వారికే, గెలుపు బాధ్యత వారిదే - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!
స్థానిక ఎన్నికల్లో సీట్లు వారికే, గెలుపు బాధ్యత వారిదే - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!

ఆ తరువాత అక్కడ నుంచి సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లిన విజయ్... నీటి వ్యవహారాల పై కీలక చర్చలు చేయనున్నారు. తమిళనాడుకు తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తాగునీటిని అందిస్తున్న అంశంపై వీరు చర్చించనున్నారు. అలాగే చెన్నై తాగు నీటి అవసరాలకు తెలుగు గంగ ద్వారా ఈ ఏడాది 4.08 టీఎంసీల నీటిని ఏపీ ఇచ్చింది.

తెలుగు గంగ నుంచి నీటి విడుదలను పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని తమిళనాడు ప్రభుత్వం కోరుతుంది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తుంది. మానవీయ కోణంలో తమిళనాడుకు తాగు నీటి అవసరాలకు నీరు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ భేటీ తరువాత కృష్ణా నదీ తీరంలో ఏర్పాటు చేసిన జాతీయ సరస్ ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, విజయవాడ ఉత్సవ్ 2.0 లో సీఎం విజయ్ పాల్గొననున్నారు. ఆ తరువాత గన్నవరం నుంచి నేరుగా చెన్నై బయల్దేరుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+