సీఎం పళనిసామి సెంచరీ, నాటౌట్: పన్నీర్ పేరు వినపడకుండా ప్లాన్, మోడీ జపం !

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తి అయిన సందర్బంగా ఎడప్పాడి పళనిసామి ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ప్రధాని మోడీ జపం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇలా దగ్గర కావాలని తన మంత్రి వర్గానిక

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తి అయిన సందర్బంగా ఎడప్పాడి పళనిసామి ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు తాను అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన వివిద అభివృద్ది పనులు, సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు.

అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు జరిగిన అభివృద్ది పనుల గురించి ప్రజలకు వివరించడానికి ఎడప్పాడి పళనిసామి ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. అందుకోసం ప్రత్యేక ప్రకటనలు ఇవ్వాలని వివిధ శాఖలకు చెందిన మంత్రులకు సూచించారు.

అమ్మ జయలలిత పేరుతో

అమ్మ జయలలిత పేరుతో

2016లో తమిళనాడులో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే పార్టీ పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలు గురించి పెద్దపెద్ద ఫ్లెక్సీలు, పోస్టర్లు వేసి తమిళనాడులోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చెయ్యాలని, అందులో జయలలిత ఫోటోలు పెట్టాలని ఎడప్పాడి పళనిసామి ఆదేశాలు జారీ చేశారు.

సంవత్సరం పూర్తి అయ్యింది

సంవత్సరం పూర్తి అయ్యింది

అన్నాడీఎంకే పార్టీ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చి ఒక్క సంవత్సరం పూర్తి చేసుకోంది. అంతే కాకుండా పళనిసామి స్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తి అయ్యింది. ఈ సందర్బంలో పళనిసామి వర్గంలోని నాయకులు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.

పన్నీర్ పేరు, ఫోటో లేకుండా చూడండి !

పన్నీర్ పేరు, ఫోటో లేకుండా చూడండి !

ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ది పనుల గురించి ప్రజలకు తెలియజేయడానికి ఏర్పాటు చేస్తన్న ఫ్లెక్సీల్లో ఎక్కడా పన్నీర్ సెల్వం ఫోటో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పళనిసామి ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. అంతే కాకుండ పన్నీర్ సెల్వం పేరుకూడా ఎక్కడ వినిపించరాదని సీఎం సూచించారని తెలిసింది.

మోడీని ప్రసన్నం చేసుకోవడానికి !

మోడీని ప్రసన్నం చేసుకోవడానికి !

తమిళనాడులో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని, అలా చేసి కేంద్ర ప్రభుత్వానికి దగ్గర కావాలని ఎడప్పాడి పళనిసామి సూచించారని తెలిసింది. వీలైనంత వరకు కేంద్ర ప్రభుత్వాన్ని పోగిడి ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకోవాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేశారని వెలుగు చూసింది.

సెంచరీ కాదు, నాలుగేళ్లు మనమే !

సెంచరీ కాదు, నాలుగేళ్లు మనమే !

సీఎంగా అధికారం చేపట్టి వందరోజులు పూర్తి అయ్యిందని, ఇక ముందు మనకు ఎలాంటి అటంకాలు లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని తన మంత్రి వర్గానికి ఎడప్పాడి పళనిసామి పలు సూచనలు, సలహాలు ఇచ్చారని తెలిసింది. నాలుగేళ్లు మనమే అధికారంలో ఉండాలని ఆయన పక్కా ప్లాన్ వేస్తున్నారని తెలిసింది.

ప్రతిపక్షాలకు నో చాన్స్

ప్రతిపక్షాలకు నో చాన్స్

అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిన సందర్బంలో రాజకీయ స్వార్థం కోసం ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, అందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలని పళనిసామి తన వర్గంలోని నాయకులకు సూచించారు. అందుకు తగ్గట్లుగానే ఫ్లెక్సీలు ఏర్పాటు చెయ్యడంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు.

సీఎంను టార్గెట్ చేస్తున్న ఓపీఎస్ టీం

సీఎంను టార్గెట్ చేస్తున్న ఓపీఎస్ టీం

జయలలిత మరణం తరువాత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పన్నీర్ సెల్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులు తప్పా కొత్తగా ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం చేపట్టింది ఏమీ లేదని ఆయన వర్గంలోని నాయకులు అంటున్నారు. ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చెయ్యడానికి సిద్దం అవుతున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+