తమిళనాడు సీఎం సంతోషం: అందరూ కలిసే చిహ్నం సాధించాం, బీజేపీని ఆశ్రయించలేదు !
రెండాకుల చిహ్నం సొంతం అయినందుకు సంతోషంగా ఉంది, సీఎం.90 శాతం మంది కార్యాకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీల సహకారం తీసుకున్నాం.కేంద్రంలోని బీజేపీని ఆశ్రయించలేదు, ఎప్పటికైన న్యాయం, ధర్మం గెలుస్తోంది, పళనిసామి
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం, పార్టీ జెండా తమ వర్గానికి రావడంతో తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి సంతోషం వ్యక్తం చేశారు. గురువారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన సీఎం ఎడప్పాడి పళనిసామి భారత ఎన్నికల కమిషన్ రెండాకుల చిహ్నం కేటాయించే విషయంలో సరైన నిర్ణయం తీసుకుందని, అందరూ కలిసే అన్నాడీఎంకే చిహ్నం సాధించుకున్నామని, బీజేపీని ఆశ్రయించలేదని పళనిసామి అన్నారు.
ఎప్పటికైనా న్యాయం, ధర్మం విజయం సాధిస్తోందని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి చెప్పారు. అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం మా సొంతం అయినందుకు చాల ఆనందంగా ఉందని చెప్పారు. అన్నాడీఎంకే పార్టీకి తామే నిజమైన వారసులు అన్ని ఎడప్పాడి పళనిసామి చెప్పారు.

అన్నాడీఎంకే పార్టీకి చెందిన శాసన సభ్యులు, ఎంపీలు, జిల్లా కార్యదర్శులు, కార్యకర్తల సహకారంతో తాము పార్టీ గుర్తు సొంతం చేసుకున్నామని, కేంద్రంలోని బీజేపీ సహాయం తీసుకోలేదని సీఎం ఎడప్పాడ పళనిసామి అన్నారు. పార్టీని సొంతం చేసుకోవడానికి నిజాయితీగా 90 శాతం మంది పార్టీ కార్యకర్తల సహకారం తీసుకున్నామని ఎడప్పాడి పళనిసామి వివరించారు.
రెండాకుల చిహ్నం సొంతం కావడంతో పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గీయులు చెన్నైలోని రాయపేటలోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్నారు. 2016 డిసెంబర్ 5వ తేదీ జయలలిత మరణించడం, సీఎం పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం చిన్నమ్మ శశికళ మీద తిరుబాటు చెయ్యడంతో అన్నాడీఎంకే పార్టీ రెండు ముక్కలు అయ్యింది.
అన్నాడీఎంకేలోని వర్గ పోరుతో 2017 మార్చి 22వ తేదీన భారత ఎన్నికల కమిషన్ రెండాకుల చిహ్నాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. 2017 ఏప్రిల్ 15వ తేదీన ఇరు వర్గాలు భారత ఎన్నికల కమిషన్ ముందు అఫిడవిట్లు సమర్పించారు. అప్పటి నుంచి భారత ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న రెండాకుల చిహ్నం గుర్తు ఎట్టకేలకు గురువారం పళనిసామి, పన్నీర్ సెల్వం చేతికి వెళ్లింది.












Click it and Unblock the Notifications