జయ మృతి ప్రచారం, రెచ్చిన అభిమానులు: రాళ్లు-చెప్పులతో దాడి
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉన్న అపోలో ఆసుపత్రి వద్ద సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉన్న అపోలో ఆసుపత్రి వద్ద సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జయ మృతి చెందినట్లు వదంతులు రాగానే అభిమానులు, కార్యకర్తలు రెచ్చిపోయారు.
విషయం తెలియగానే అభిమానులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అపోలో ఆసుపత్రి పైన రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. హోర్డింగులను విరగ్గొట్టారు. చాలా మంది ఆసుపత్రిలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, వారిని పోలీసులు అడ్డుకున్నారు.

ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నేపథ్యంలో బ్లాక్ కమాండోస్ అపోలో వద్దకు చేరుకున్నాయి. అభిమానులు వీరంగం సృష్టించకుండా పోలీసులు, కమాండోస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications