జయలలితకు అక్రమాస్తుల కేసు తీర్పు: దసరా తరువాతే !
బెంగళూరు: తమిళనాడు ప్రజలు అమ్మ అని పిలుచుకునే జయలలితకు మళ్లీ అక్రమాస్తుల కేసు కష్టాలు మొదలైనాయి. దసరా సెలవులు అయిన తరువాత జయలలిత అక్రమాస్తుల కేసు విచారణ, తీర్పు వెలువడనుంది.
ఈ అక్రమాస్తుల కేసుకు సంబంధించి జయలలిత నేరం చేశారని రుజువు కావడంతో ఆమెకు కోర్టు శిక్ష విధించింది. జయలలిత బెంగళూరు నగర శివారల్లోని పరప్పన అగ్రహార జైలుకు వెళ్లారు. తరువాత ఆమె బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు.
తరువాత కర్ణాటక హై కోర్టు కేసు కొట్టి వెయ్యడంతో మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సుప్రీం కోర్టుకు అక్టోబర్ 10 నుంచి 15వ తేదీ వరకు దసరా సెలవులు.

అందు వలన జయలలిత అక్రమాస్తుల కేసు విచారణ అక్టోబర్ 17వ తేది జరిగే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. సెలవులలో స్పెషల్ బెంచ్ విచారణ చేపట్టినా తీర్పు ఇచ్చే అవకాశం తక్కువగా ఉంది.
ప్రత్యేక బెంచ్ మళ్లీ కేసు విచారించి అంతిమ తీర్పు చెప్పే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. 2016 జూన్ 8వ తేది కేసు విచారణ పూర్తి చేసిన తరువాత తీర్పు రిజర్వులో పెట్టారు.
అక్రమాస్తుల కేసులో జయలలితకు బెయిల్ వచ్చిన తరువాత కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జయలలిత, ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళ నటరాజన్, సుధాకరన్, ఇళవరసి నేరం చేసినట్లు రుజువు అయ్యిందని, బెయిల్ రద్దు చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.












Click it and Unblock the Notifications