తమిళనాడు సీఎం, స్పీకర్ భేటీ: రెబల్ ఎమ్మెల్యేలపై వేటు ? అసెంబ్లీలో అడుగుపెట్టకుండా !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు దారిలోకి రాకుంటే వారి మీద అనర్హత వేటు వెయ్యడానికి సిద్దం అవుతున్నారు.

సీఎం: స్టాలిన్ వ్యూహం మారింది: రెబల్ ఎమ్మెల్యేలతో అధికారంలోకి ? పళని, పన్నీర్ టెన్షన్ !

సోమవారం మద్యాహ్నం తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ ను సచివాలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి కలుసుకుని చర్చించారు. రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ధనపాల్ మూడు సార్లు నోటీసులు ఇచ్చినా వారి నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది.

Tamil Nadu CM Palanisamy met Speaker Dhanapal at secretariat

అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలంటే ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యేలు అందరిమీద పార్టీ నియమాలు ఉల్లంఘించారని, అధికారంలో ఉన్న సొంత పార్టీ నాయకత్వం మీద తిరుగుబాటు చేశారని వారి మీద వేటు వెయ్యడానికి సిద్దం అవుతున్నారు.

శశికళ భర్త నటరాజన్ పరిస్థితి విషమం: లండన్ వైద్యుడు చికిత్స, లివర్, కిడ్నీ ఫెయిల్యూర్స్!

అసెంబ్లీలో అడుగుపెట్టకుండా అనర్హత వేటు వేస్తే రెబల్ ఎమ్మెల్యేలు దారిలోకి వచ్చే అవకాశం ఉందని పళనిసామి, పన్నీర్ సెల్వం భావించారు. మంగళవారం చెన్నైలోని రాయపేట్ లోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రెబల్ ఎమ్మెల్యేలు హాజరుకాకుంటే కచ్చితంగా వారి మీద స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశం ఉందని, ఇదే విషయంపై సోమవారం ధనపాల్, పళనిసామి చర్చించారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CM Palanisamy met Speaker Dhanapal at secretariat and sources saying that both were discussed about the petition given by Vetrivel MLA seeking whip's dismissal.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి