చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళతో పన్నీర్ సెల్వం భేటీ: ఎం చెప్పారంటే ?

జల్లికట్టు నిర్వహణపై తమిళనాడు ప్రభుత్వం ఢిల్లీలోనే అత్యవసర ముసాయిదా చట్టాన్ని రూపొందించడం, ప్రధాని నరేంద్ర మోడీతో జరిపిన చర్చలు గురించి పన్నీర్ సెల్వం శశికళకు సమగ్రంగా వివరించారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: జల్లికట్టుపై నిషేధం తొలగించేందుకు ఢిల్లీ వెళ్లి తిరిగి చెన్నై చేరుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పోయెస్ గార్డెన్ చేరుకుని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను కలుసుకున్నారు.

జల్లికట్టు ఆర్డినెన్సుపై అనుమానాలు, కదిలే ప్రసక్తే లేదు, లక్ష మంది !

జల్లికట్టు నిర్వహణపై తమిళనాడు ప్రభుత్వం ఢిల్లీలోనే అత్యవసర ముసాయిదా చట్టాన్ని రూపొందించడం, ప్రధాని నరేంద్ర మోడీతో జరిపిన చర్చలు తదితర విషయాల గురించి పన్నీర్ సెల్వం శశికళకు సమగ్రంగా వివరించారు.

Tamil Nadu CM Panneerselvam has reportedly met AIADMK General Secretary Sasikala

జల్లికట్టు నిర్వహణపై సీఎం పన్నీర్ సెల్వం తీసుకుంటున్న చర్యల పట్ల చిన్నమ్మ శశికళ హర్షం వ్యక్తం చేశారని అన్నాడీఎంకే పార్టీ నాయకులు తెలిపారు. అయితే జల్లికట్టు నిర్వహణపై శశికళ ఇంత వరకు మాట్లాడకపోవడంతో అన్నాడీఎంకే పార్టీలోని ఆమె వ్యతిరేక వర్గీయులు మండిపడుతున్నారు.

ఒకటి రెండురోజుల్లో జల్లికట్టు: పన్నీర్, మీ పని మీరు చూసుకోండి

జయలలిత వారుసురాలు అని చెప్పుకుంటున్న శశికళ జల్లికట్టు జరిపించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఎందుకు బహిరంగంగా తమిళ ప్రజలకు చెప్పడం లేదు ? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద శశికళ మీద సమయం చిక్కినప్పుడు ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న నాయకులు విమర్శలు చేస్తున్నారు.

English summary
Tamil Nadu Chief Minister O Panneerselvam has reportedly met AIADMK general secretary Sasikala Natarajan in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X