చలో చెన్నై: పన్నీర్ ఇంటి దగ్గర క్యూ, ఏకమైన అన్నాడీఎంకే సీనియర్లు
తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారడంతో అన్నాడీఎంకే పార్టీలో శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకులు అందరూ ఇప్పుడు చెన్నై చేరుకుని పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర క్యూకడుతున్నారు.
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారడంతో అన్నాడీఎంకే పార్టీలో శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకులు అందరూ ఇప్పుడు చెన్నై చేరుకుంటున్నారు. శశికళ సీఎం కాకుండా అడ్డుకోవడానికి పావులు కదుపుతున్నారు.
ఇప్పటికే పన్నీర్ సెల్వంకు బహిరంగం మద్దతు ప్రకటించిన మాజీ స్పీకర్, అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) సన్నిహితుడు, ఆపార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన పీహెచ్. పాండియన్, మాజీ మంత్రి కేపి. మునిసామి తదితరులతో చర్చిస్తున్నారు.

అన్నాడీఎంకే పార్టీ ప్రిసీడియం చెర్మన్ మధుసూదనన్ సైతం తన రాజకీయ అనుభవంతో నాయకులు అందరినీ ఒక్కటి చేస్తున్నారు. పన్నీర్ సెల్వం ఇంటి దగ్గరకు అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకులు క్యూకడుతున్నారు. శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
అయితే మన్నార్ గుడి గ్యాంగ్ సభ్యులు పన్నీర్ సెల్వం అభిమానుల ముసుగులో ఆయన ఇంటి దగ్గర మకాం వేసి పన్నీర్ సెల్వంకు ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు అని విషయం ఎప్పటికప్పుడు శశికళ వర్గీయులకు సమాచారం ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications