మళ్లీ తెరమీదకు కావేరీ నీరు: వెంటనే విడుదల చెయ్యండా, సిద్దూకు పళనిస్వామి లేఖ !
బెంగళూరు/చెన్నై: తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య మరోసారి కావేరీ నీటి పంపిణి విషయం తెర మీదకు వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వెంటనే 7 టీఎంసీల నీరు విడుదల చెయ్యాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశారు.
మీ రాష్ట్ర అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి 7 టీఎంసీల కావేరీ నీరు విడుదల చెయ్యడానికి చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు శనివారం లేఖ రాశారు.

ప్రస్తుతం 7 టీఎంసీల కావేరీ నీటిని విడుదల చెయ్యాలని, మిగిలిన 8 టీఎంసీల నీరును 15 రోజుల్లో విడుదల చెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మనవి చేశారు. అయితే ఎడప్పాడి పళనిస్వామి లేఖపై ఢిల్లీలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎలా స్పంధిస్తారో వేచి చూడాలని అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications