నటి శృతికి బెయిల్ ఇవ్వలేం: ప్రేమ, పెళ్లి, ఘరానామోసం: రూ. కోట్లలో వసూలు!
చెన్నై: తమిళ నటి శృతికి బెయిల్ ఇవ్వడానికి తమిళనాడులోని కోయంబత్తూరు కోర్టు నిరాకరించింది. నటి శృతితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు, మోసగించడానికి సహకరించిన వ్యక్తికి ఎట్టిపరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం కుదరదని కోయంబత్తూరు కోర్టు తేల్చి చెప్పింది. ప్రేమ, పెళ్లి పేరుతో నటి శృతి మోసం చేసి రూ. కోట్లలో వసూలు చేసిందని కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

ప్రేమ పెళ్లి పేరుతో !
నటి శృతి తన అందంతో యువకులకు ఎరవేసి ప్రేమ, పెళ్లి పేరుతో రూ. కోట్లలో నగదు వసూలు చేసి మోసం చేసిందని అనేక మంది బాధితులు వాపోతున్నారు. నటి శృతికి ఆమె తల్లి చిత్ర, సోదరుడు సుభాష్, వారి సమీప బంధువు ప్రసన్న వెంకటేష్ లు సహకరించారు.

విదేశీ టెక్కీలకు వల
తమిళనాడులోని ఎడప్పాడి ప్రాంతానికి చెందిన బాలకుమార్ విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో బాలకుమార్ కు నటి శృతి తన అందం అయిన ఫోటోలు ఫేస్ బుక్ లో పంపించి పరిచయం చేసుకుంది.

నిన్నేపెళ్లాడుతా !
నటి శృతి నిన్నేపెళ్లాడుతా అంటూ బాలకుమార్ ను నమ్మించింది. తన తల్లికి అనారోగ్యంగా ఉందని, అప్పుల్లో ఉన్న ఇంటిని కాపాడుకోవడానికి నగదు సహాయం చెయ్యాలని నమ్మించింది. నటి శృతి బాలకుమార్ నుంచి తన బ్యాంకు ఖాతాలో రూ. 45 లక్షలు డిపాజిట్ చేయించుకుంది.

స్నేహితుడి సహాయం !
తాను శృతిని వివాహం చేసుకుంటున్నానని బాలకుమార్ తమిళనాడులో ఉన్న స్నేహితుడికి ఆమె ఫోటోలు పంపించాడు. నీవు మోసపోయావని, ఈమె ఇప్పటికే చాల మందిని ఇలాగే మోసం చేసిందని బాలకుమార్ కు అతని స్నేహితుడు సమాచారం ఇచ్చాడు.

సైబర్ క్రైం పోలీసులు
తాను మోసపోయానని బాలకుమార్ కోయంబత్తూరు సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నటి శ్రుతి, ఆమె తల్లి చిత్ర, సోదరుడు సుభాష్, వీరి బంధువు ప్రసన్న వెంకటేశ్‌లను అరెస్ట్ చేసి కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు పంపించారు.

బెయిల్ ఇవ్వలేం
నటి శ్రుతి, ఆమె తల్లి చిత్ర, సోదరుడు సుభాష్ , ప్రసన్న వెంకటేష్ తమకు బెయిల్ మంజూరు చేయ్యాలని కోయంబత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ జరిపిన న్యాయమూర్తి వేలుస్వామి ఆ నలుగురికి బెయిల్ మంజూరు చెయ్యడానికి నిరాకరించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications