శశికళ వద్ద బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలను తీసుకు రా: డీజీపీకి పన్నీరు
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. చిన్నమ్మ పైన పన్నీరు దూకుడు పెంచారు. ఎమ్మెల్యేలు అందరు కూడా శశికళ వద్ద బంధీలుగా ఉన్నట్లు భావిస్తున్నారు
చెన్నై: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. చిన్నమ్మ పైన పన్నీరు దూకుడు పెంచారు. ఎమ్మెల్యేలు అందరు కూడా శశికళ వద్ద బందీలుగా ఉన్నట్లు భావిస్తున్నారు.
ఈ మేరకు ఆయన డిజిపితో భేటీ అయ్యారు. వెంటనే శశికళ బందించిన ఎమ్మెల్యేలను అందరినీ తీసుకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. తద్వారా శశికళ వారందరినీ బంధించినట్లుగా పన్నీరు భావిస్తున్నారు.
పన్నీరు సెల్వం పార్టీ పైన, ప్రభుత్వం పైన క్రమంగా పట్టు సాధిస్తున్నారు. ఈ మేరకు ఆయన పావులు కదుపుతున్నారు. ఈ రోజు (గురువారం) పన్నీరుది పైచేయిగా కనిపిస్తోంది. అంతేకాదు, ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరు శశికళ నుంచి జారిపోతున్నట్లుగా కూడా కనిపిస్తోంది.
శశికళ కంటే ముందే అన్నాడీఎంకే ఎంపీలు
ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్ విద్యాసాగర రావు చెన్నై వస్తున్నారు. ఆయన మూడంపావుకు వస్తారు. ఆ తర్వాత ఐదు గంటలకు శశికళ వర్గీయులు గవర్నర్ ముందు పరేడ్ నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, అంతకుముందే అన్నాడీఎంకే ఎంపీలు కూడా గవర్నర్‌ను కలవనున్నారు. ఢిల్లీ నుంచి ఎంపీలంతా రావాలని శశికళ వారిని ఆదేశించారు.

తమిళనాడులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపరిస్థితి దాగుడుమూతలు ఆడుతున్నట్లుంది. శశికళ తన శిబిరంలోని 130 మంది ఎమ్మెల్యేలను ఎవ్వరూ ప్రలోభ పెట్టకుండా జాగ్రత్తగా దాచిన విషయం తెలిసిందే.
బుధవారం మధ్యాహ్నం పార్టీ సమావేశం అయిపోగానే అందరినీ లగ్జరీ బస్సుల్లో ఎక్కించి రహస్య ప్రాంతానికి తరలించారు. వీరంతా చెన్నై శివారుల్లోని కొన్ని రిసార్టుల్లో ఉన్నారు. 130 మంది ఎమ్మెల్యేలు బృందాలుగా విడిపోయి శివారుల్లోని వేర్వేరు లగ్జరీ రిసార్టుల్లో ఉన్నారు.
బీచ్‌ల్లో వాటర్ స్కీయింగ్‌లతో పాటు చక్కగా మసాజ్‌లు చేయించుకుంటూ లగ్జరీ రిసార్టుల్లో గడుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈస్ట్‌కోస్ట్ రోడ్‌లోని రిసార్ట్‌లో కొందరు ఉన్నారని, ఓ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో ఉన్నారని రకరకాలుగా చెప్తున్నారు.
చెన్నైకి 80 కి.మీ. దూరంలోని మహాబలిపురం సమీపంలోని రిసార్ట్‌లో కొందరు శాసనసభ్యులు ఉన్నట్లు ఓ జాతీయ మీడియా గుర్తించినట్లుగా తెలుస్తోంది.
అయితే ఎస్పీ షణ్ముగనాథన్ అనే ఎమ్మెల్యే బాత్రూమ్‌కెళ్తానని చెప్పి వెళ్లి మళ్లీ కనిపించలేదట. ఆయన పన్నీర్ సెల్వం శిబిరంలో చేరిపోయినట్లు భావిస్తున్నారు. తమిళనాడు శాసనసభలో తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వంకు, శశికళకు బలనిరూపణ జరిగే అవకాశముంది.












Click it and Unblock the Notifications