మోడీ, జయ భేటీ: అయోమయంలో కెప్టెన్
చెన్నయ్: అన్నాడీఎం-బీజేపీ చట్టాపట్టాలు వేసుకుంటున్న సమయంలో డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ ఆయోమయంలో పడ్డారు. ఇప్పుడు ఏం చెద్దాం అని పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని పలువురు నాయకులు సూచించారు.
తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికలలో అన్నా డీఎంకే పార్టీతో కలిసి పోత్తు పెట్టుకున్న డీఎండీకే పలు శాసన సభ స్థానాలు కైవసం చేసుకునింది. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో కెప్టెన్ వైరం పెంచున్నారు.
జయలలితకు దూరం అయ్యాడు. అనంతరం జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీజేపీతో పోత్తుకుని పోటి చేశారు. అయితే డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. అయినా కెప్టెన్ బీజేపీ నాయకుల దగ్గర విశ్వాసంగానే ఉన్నారు. నిత్యం వారితో టచ్ లో ఉన్నారు.

ఇదే సమయంలో బీజేపీ-డీఎండీకే ఉమ్మడి సీఎం అభ్యర్థి తానే అని కెప్టెన్ విజయ్ కాంత్ ప్రకటించుకున్నారు. అయితే ఇటివల తాను ఏ పార్టీతో పోత్తు పెట్టుకోలేదని, ఎవ్వరితో కలిసి ఉండటం లేదని, డీఎండీకే స్వతంత్రంగా ఉందని విజయ్ కాంత్ అన్నారు.
ఇటివల ప్రధాని నరేంద్ర మోడీ చెన్నయ్ పర్యటనకు వచ్చిన సమయంలో విజయ్ కాంత్ దూరంగా ఉన్నారు. ఇదే సందర్బంలో నరేంద్ర మోడీ స్వయంగా జయలలిత ఇంటికి వెళ్లడం, అక్కడే భోజనం చేసి చాలసేపు మాట్లాడటంతో విజయ్ కాంత్ నోట్లో వెలక్కాయపడింది.
బీజేపీ అన్నాడీఎంకే ఒక్కటి అయ్యాయని వార్తలు గుప్పుమన్నాయి. ఇదే సందర్బంలో విజయ్ కాంత్ అయోమయంలో పడ్డారు. అనుకున్నది ఒకటైతే జరిగింది మరోటి అని డీఎండీకే నేతలు అంటున్నారు. వెంటనే పార్టీ నాయకులతో విజయ్ కాంత్ సమావేశం అయ్యారు.
డీఎండీకే, సీపీఎం, సీపీఐ, వీసీకేలతో కలిసి ప్రత్యేక కూటమి ఎర్పాటు చెయ్యడమా, లేక డీఎంకే కూటమిలోకి వెళ్లడమా అని సుదీర్ఘంగా చర్చించారు. గతంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు ఇప్పుడు వద్దని, అన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని పలువురు సీనియర్లు విజయ్ కాంత్ కు సలహా ఇచ్చారు.
మద్య నిషేదం విదించాలని తమిళనాడు ప్రభుత్వం మీద విజయ్ కాంత్ మండిపడుతున్నారు. ఇదే నెల 20వ తేది విజయ్ కాంత్ పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి. నెల రోజులు క్యాప్టెన్ బర్త్ డే వేడుకలు నిర్వహించడానికి ఎర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద కంగుతిన్న విజయ్ కాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని వేచిచూడాలి.












Click it and Unblock the Notifications