పారిపోదాం రా: పన్నీర్ గూటికి మంత్రి అండ్ కో: చిన్నమ్మకు చుక్కలు !
తమిళనాడు విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్ పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోయి శశికళకు ఝలక్ ఇచ్చారు. తనతో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి పన్నీర్ సెల్వంకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తే శశికళ.
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు థ్రిల్లర్ సినిమాలను తలతన్నే విధంగా తయారైనాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్థం కాక ప్రజలు టెన్షన్ పడుతున్నారు. తాజాగా శనివారం మద్యాహ్నం తమిళనాడు విద్యాశాఖ మంత్రి మా పొయ్ పాండ్యరాజన్ పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోయి శశికళకు ఝలక్ ఇచ్చారు.
శనివారం ఉదయం వరకు శశికళ క్యాంపులో ఉన్న పాండ్యరాజన్ ఒక్క సారిగా రిసార్ట్ నుంచి బయటకు వచ్చేశారు. నేరుగా చెన్నై చేరుకున్న ఆయన తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంటికి చేరుకుని ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

అనంతరం విద్యాశాఖా మంత్రి పాండ్యారాజన్ మీడియాతో మాట్లాడుతూ శశికళ అనుచరులు మా పార్టీ (అన్నాడీఎంకే) ఎమ్మెల్యేలను బలవంతంగా రిసార్ట్ లో నిర్బంధించారని ఆరోపించారు. తనతో పాటు ఎమ్మెల్యేలు బయటకురావడానికి ప్రయత్నిస్తే శశికళ అనుచరులైన మన్నార్ గుడి గ్యాంగ్ వారిని అడ్డుకున్నారని ఆరోపించారు.
శశికళ శిభిరంలో ఉన్న దాదాపు అందరు ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంకు మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని మీడియాకు చెప్పారు. శశికళ, ఆమె అనుచరుల అరాచకాలకు త్వరలోనే చెక్ పెట్టే సమయం వస్తుందని మంత్రి పాండ్యారాజన్ చెప్పారు. మంత్రి పాండ్యరాజన్ తో పాటు ఆయన అనుచరులు పన్నీర్ కు మద్దతు ప్రకటించారు.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ (శుక్రవారం ఏపక్షంగా శశికళ బహిష్కరించారు), మాజీ మంత్రి అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు మునిసామి, ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ శశికళ మీద విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications