వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు ఎన్నికల పోరులో ఆన్ లైన్ ప్రచారం .. కమల్ హాసన్ పార్టీ అభ్యర్థికి కరోనా పాజిటివ్ తెచ్చిన కష్టం

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తాజా పరిస్థితి గందరగోళంగా మారుతోంది. ఒకపక్క నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. కరోనా నిబంధనలకు విరుద్ధంగా భారీ సంఖ్యలో జన సమూహాల మధ్య ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారం కారణంగా కరోనా మరింత పెరుగుతుందనే అనుమానం ఆయా రాష్ట్రాలలో వ్యక్తమౌతుంది.

Tamil Nadu Assembly Election 2021: కమల్ హాసన్ సీఎం అవ్వటం ఖాయం - రాధికా శరత్ కుమార్Tamil Nadu Assembly Election 2021: కమల్ హాసన్ సీఎం అవ్వటం ఖాయం - రాధికా శరత్ కుమార్

వేలాచేరి నియోజకవర్గ మక్కల్ నీది మయ్యం అభ్యర్థికి కరోనా పాజిటివ్

వేలాచేరి నియోజకవర్గ మక్కల్ నీది మయ్యం అభ్యర్థికి కరోనా పాజిటివ్

ఇక తాజాగా తమిళనాడు ఎన్నికల హీట్ పీక్స్ కు చేరుకుంది. తమిళనాడులో హోరాహోరీగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలను ఎక్కు పెడుతూ, ఆల్ ఫ్రీ మంత్రంతో ఓటర్ల మనసును గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ పార్టీల నాయకులు. నియోజకవర్గాలను కలియతిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కమల్ హాసన్ కు చెందిన మక్కల్ నీది మయ్యం పార్టీలో వేలాచేరి నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగిన సంతోష్ బాబుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఆన్ లైన్ లో ప్రచారం కొనసాగిస్తున్న మక్కల్ నీది మయ్యం పార్టీ అభ్యర్థి సంతోష్ బాబు

ఆన్ లైన్ లో ప్రచారం కొనసాగిస్తున్న మక్కల్ నీది మయ్యం పార్టీ అభ్యర్థి సంతోష్ బాబు

దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు

. ఇక ఇదే విషయాన్ని సంతోష్ బాబు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. వేలాచేరి నియోజకవర్గానికి పోటీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఆన్లైన్ ప్రచారానికి తెర తీశారు. వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా ఆయన తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలోని స్థానికులతో సంభాషిస్తున్నారు. అంతే కాదు తన ప్రచారాన్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలనే ప్రణాళికలో ఉన్నారు.

క్యూఆర్ కోడ్ పంపి ఓటర్లతో వెబ్ సైట్ కి లాగిన్ చేయిస్తున్న అభ్యర్థి వినూత్న ప్రచారం

క్యూఆర్ కోడ్ పంపి ఓటర్లతో వెబ్ సైట్ కి లాగిన్ చేయిస్తున్న అభ్యర్థి వినూత్న ప్రచారం

ఆన్లైన్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్న మక్కల్ నీది మయ్యం పార్టీ అభ్యర్థి సంతోష్ బాబు , నియోజకవర్గ ఓటర్లందరికీ కరపత్రాలతోపాటుగా క్యూఆర్ కోడ్ ను కూడా పంపిణీ చేయిస్తున్నారు . ఇక ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసిన వెంటనే అది ఓటరును తన వెబ్ సైట్ కు నిర్దేశిస్తుందని అందులో అతని మేనిఫెస్టో తో సహా సంబంధిత అన్ని వివరాలు ఉంటాయని, ఎన్నికల ప్రచారం సైతం వెబ్సైట్ ద్వారా చూడవచ్చని చెప్తున్నారు. అంతేకాదు త్రీడీ విజువల్స్ పై కూడా దృష్టి పెట్టిన సంతోష్ బాబు తాను చెప్పదలుచుకున్న ప్రతి అంశాన్ని ఆన్లైన్లో విజువలైజ్ చేసి లైవ్లో అందించనున్నారు.

 భారత నెట్ ప్రాజెక్ట్ లో ప్రభుత్వం జోక్యం నిరసిస్తూ గతేడాది రాజీనామా

భారత నెట్ ప్రాజెక్ట్ లో ప్రభుత్వం జోక్యం నిరసిస్తూ గతేడాది రాజీనామా

మొదట వేరొక స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించిన సంతోష్ బాబు ఆ తర్వాత, వేలాచేరి నుండి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. రెండు వేల కోట్ల రూపాయల భారత నెట్ ప్రాజెక్ట్ లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని నిరసిస్తూ గతేడాది ఆయన ప్రభుత్వ ఉద్యోగం నుండి ఎనిమిది సంవత్సరాల సర్వీస్ కాలం ఉండగానే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు సంతోష్ బాబు. ప్రభుత్వ కార్యాలయాలలో ఆన్లైన్ సేవలకు సంబంధించి ఆయన ఉద్యోగం లో ఉన్న సమయంలో కీలకంగా పని చేశారు.


ఇప్పుడు ఆయన ఎన్నికల ప్రచారం కూడా ఆన్ లైన్ లో చేస్తుండటం గమనార్హం .

English summary
Santhosh Babu, who joined Kamal Haasan’s Makkal Needhi Maiam and is contesting from the Velachery constituency, announced on Twitter that he had tested positive for COVID-19. He started campaign in online,” Dr. Babu told he interacted with residents from the hospital through WhatsApp video calls. “From tomorrow, the plan is to go live on Twitter, Facebook, Instagram and other social media forums,” he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X