జయలలిత తలవంచేది ఎవ్వరి ముందో తెలుసా !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితంలో ఎవ్వరి ముందు తలవంచలేదని అందరూ అంటుంటారు. అయితే జయలలిత ఊహ తెలిసిన తరువాత ఆ దేవుడి తరువాత ముగ్గురి ముందు తలవంచారు.
జన్మనిచ్చిన తల్లి సంధ్య, రాజకీయ జన్మనిచ్చిన ఎంజీఆర్ తరువాత అంతటి గౌరవం గుర్తింపు తెచ్చుకున్న వారు మరో వ్యక్తి ఉన్నారు. ఆయనే చో రామస్వామి. ఎంజీఆర్ చనిపోయిన తరువాత జయలలిత తమిళనాడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు.

ఐదు సార్లు ముఖ్యమంత్రి అయిన జయలలిత తమిళనాడు రాజకీయాల్లో కేంద్ర బిందువు అయ్యారు. ఆమె ఎవ్వరి ముందు తలవంచలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా పోరాటం చేశారు. అయితే ఫిబ్రవరి 24వ తేది వచ్చిందంటే ఆమె తుగ్లక్ పత్రిక సంపాదకుడు, రచయిత, సినీ నటుడు, న్యాయవాది, సినిమా దర్శకుడు అయిన చో రామస్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.
ప్రతి పుట్టిన రోజు చో రామస్వామి, సౌందర రామస్వామి దంపతుల ముందు జయలలిత శిరసు వంచి ఆశీర్వాదం తీసుకుంటారు. మరెవరి ముందు జయలలిత తలవంచినట్లు ఎప్పుడు ఎవ్వరూ చూడలేదు. జయలలిత, చో రామస్వామి మధ్య అంతటి అనుభందం ఉంది.

జయలలిత డిసెంబర్ 6వ తేది సోమవారం, డిసెంబర్ 7వ తేది మంగళవారం ఉదయం చో రామస్వామి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోనే ఒక్క రోజు తేడాతో మరణించారు. జయలలిత మరణించారని చో రామస్వామికి అదే ఆసుపత్రిలో ఉన్నా ఎవ్వరూ చెప్పలేదు.












Click it and Unblock the Notifications