వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టులో లొంగిపోయిన పన్నీరు సెల్వం సోదరుడు

|
Google Oneindia TeluguNews

చెన్నయ్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఆర్థిక, ప్రజా పనుల శాఖ మంత్రిగా ఉన్న ఓ పన్వీరు సెల్వం సోదరుడు ఓ. రాజా ఒక కేసులో స్వచ్చందంగా కోర్టులో లొంగిపోయాడు. పూజారి ఆత్మహత్య కేసులో ఓ రాజా తదితరుల మీద కేసు నమోదు అయ్యింది.

పెరియకుళం సమీపంలోని ఒక గ్రామంలోని దేవాలయంలో పూజారిగా పని చేస్తున్న నాగముత్తు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ రాజ, అతని అనుచరులు ఒత్తిళ్లు, వేధింపుల కారణంగా నాగముత్తు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి.

నాగముత్తు కుటుంబ సభ్యులు మధురై జిల్లా కోర్టును ఆశ్రయించారు. అక్కడి నుండి తేని జిల్లా మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లింది. విచారణకు హాజరు కావాలని రాజాతో పాటు 7 మందికి నోటీసులు జారీ అయ్యాయి. అయితే వీరు విచారణకు హాజరు కాలేదు.

Tamil Nadu former chief minister O Panneerselvam’sbrother granted bail

వారెంట్లు జారీ అవుతున్నాయని తెలుసుకున్న పాండి అనే వ్యక్తి మూడు రోజుల క్రితం కోర్టులో లొంగిపోయాడు. తరువాత బెయిల్ తీసుకున్నాడు. కళ్లు తెరిచిన పన్నీరు సెల్వం సోదరుడు రాజా కోర్టులో లొంగిపోవడానికి సిద్దం అయ్యాడు. అయితే మీడియా కంట పడరాదని ప్లాన్ వేసుకున్నాడు.

సొంత ఊరిలో అన్నా డీఎంకే పార్టీ నాయకులతో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. మీడియా అక్కడికి వెళ్లింది. రాజా కోర్టు వెనుక గేటు నుండి వెళ్లి కోర్టులో లొంగిపోయాడు. విచారణ కొంత సేపు జరిగింది. అయితే రాజాకు తొలుత బెయిల్ ఇవ్వలేదు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. భోజనం విరామం తరువాత రాజాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో పన్నీరు సెల్వం మద్దతుదారులు ఊపిరి పీల్చుకున్నారు.

English summary
Acting on the direction of the Madras High Court, Raja surrendered before Judicial Magistrate Sivagnanam at the Periyakulam court here and secured bail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X