పన్నీర్ ను కలిసిన మాజీ సీఎస్; సీనియర్ ఐఏఎస్: ఎందుకంటే!

చెన్నై: తమిళనాడు అపద్దరమ్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను శనివారం తమిళనాడు ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి కె. జ్ఞానదేశికన్, సీనియర్ ఐఏఎస్ అధికారి అతుల్ ఆనంద్ కలిశారు. పన్నీర్ సెల్వంతో సీనియర్ ఐఏఎస్ అధికారులు పలు విషయాలపై చర్చించారని తెలిసింది.

తమిళనాడు మాజీ సీఎస్ కె. జ్ఞానదేశికన్, సీనియర్ ఐఏఎస్ అధికారి అతుల్ ఆనంద్ ల మీద పలు ఆరోపణలు రావడంతో గతంలో ఇద్దరినీ సస్పెండ్ చేశారు. చిన్నమ్మ శశికళ మీద పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిన వెంటనే ఇద్దరు ఐఏఎస్ అధికారుల మీద సస్పెన్షన్ ఎత్తివేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Tamil Nadu former CS K Gnanadesikan and senior IAS officer Athul Anand meet the CM O Panneerselvam

తమ సస్పెన్షన్ ఆదేశాలు ఎత్తివేయడంతో తమిళనాడు మాజీ సీఎస్ కె. జ్ఞానదేశికన్, సీనియర్ ఐఏఎస్ అధికారి అతుల్ ఆనంద్ మర్యాదపూర్వకంగా పన్నీర్ సెల్వంను కలిసి కృతజ్ఞతలు తెలిపారని సమాచారం. అయితే ఇద్దరు అధికారులతో పన్నీర్ సెల్వం ఏమి మాట్లాడారు అనే విషయం బయటకురాలేదు.

అదే విధంగా పలువురు అధికారులతో తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాట్లాడుతున్నారు. ప్రజల సమస్యల పట్ల వెంటనే స్పందించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పలు శాఖలకు చెందిన సీనియర్ అధికారులకు పన్నీర్ సెల్వం సూచించారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+