Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డేటా సెంటర్‌ను ప్రకటించిన ముఖేష్ అంబానీ: గ్రీన్ ఎనర్జీలోభారీ పెట్టుబడులు

Mukesh Ambani: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని తమిళనాడు ప్రభుత్వం పెట్టుబడుల వేట మొదలు పెట్టింది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను తీసుకుని రావడానికి సన్నాహాలు చేపట్టింది. ఇందులో భాగంగా తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2024ను నిర్వహిస్తోంది.

ఈ ఉదయం చెన్నైలో ఈ సదస్సును ప్రారంభించారు స్టాలిన్. కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ ముఖ్య అతిథిగా ఈ సదస్సుకు హాజరయ్యారు. పలు దేశీయ, విదేశీ సంస్థలు ఈ పెట్టుబడుల సదస్సు పాల్గొన్నాయి. తొలి రోజు మధ్యాహ్నానికే వేల కోట్ల రూపాయల మేర విలువ చేసే పరస్పర అవగాహన ఒప్పందాలను ఆయా సంస్థలు తమిళనాడు ప్రభుత్వంతో కుదుర్చుకున్నాయి.

Tamil Nadu Global Investors Meet 2024: Mukesh Ambani has announced to setup data centre

హ్యుండాయ్ అదనంగా 1,180 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించింది. క్వాల్ కామ్- 177 కోట్లు, ఫస్ట్ సోలార్- 5,600 కోట్లు, గోద్రెజ్- 515 కోట్లు, టాటా ఎలక్ట్రానిక్స్- 12,082 కోట్లు, పెగాట్రాన్- 1,000 కోట్లు, జేఎస్‌డబ్ల్యూ- 12,000, టీవీఎస్ గ్రూప్- 5,000 కోట్లు, మిత్సుబిషి- 200 కోట్లు, విన్ ఫాస్ట్ 16,000 కోట్ల రూపాయల మేర ఎంఓయూలను కుదుర్చుకున్నాయి.

దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. భారీ పెట్టుబడులను ప్రకటించారు తమిళనాడులో. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్.. తమిళనాడులో భారీ డేటా సెంటర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. కెనడాకు చెందిన బ్రూక్ ఫీల్డ్ అస్సెట్ మేనేజ్‌మెంట్, యూఎస్‌కు చెందిన డిజిటల్ రియాలిటీతో కలిసి ఈ డేటా సెంటర్‌ను నెలకొల్పింది.

వచ్చే వారం దీన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు ముఖేష్ అంబానీ. దీనితో పాటు- రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టబోతోన్నామని అన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో పెట్టబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

స్టాలిన్ ప్రభుత్వాన్ని ముఖేష్ అంబానీ ప్రశంసించారు. వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా ఉందని వ్యాఖ్యానించారు. త్వరలో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా తాము తమిళనాడు వృద్ధిలో భాగస్వామిగా ఉంటోన్నామని, ఇది గర్వకారణమని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1,300 రిలయన్స్ రిటైల్ స్టోర్లను ప్రారంభించిన విషయాన్ని ముఖేష్ అంబానీ గుర్తు చేశారు. ఇప్పటికే 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టామని పేర్కొన్నారు. జియో సంస్థ తరఫున పెట్టిన 35,000 కోట్ల రూపాయల పెట్టుబడులు దీనికి అదనం అని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+