రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం- మయోనైజ్ పై నిషేధం
స్ట్రీట్ ఫుడ్ లవర్స్ కు గుడ్ న్యూస్. యువత ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తినే మయోనైజ్ ను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఏడాది పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఫుడ్ లవర్స్ ఇష్టంగా తినే మయోనైజ్ ను నిషేధించింది తమిళనాడు ప్రభుత్వం. మయోనైజ్ ఉత్పత్తి, ప్యాకేజింగ్, అమ్మకాలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం ఈ రోజు నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది. మయోనైజ్ కారణంగా ఇటీవల తమిళనాడులో ఫుడ్ పాయిజన్ కేసులు అధికంగా రావడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
మయోనైజ్ ఉత్పత్తి.. తయారీ.. నిల్వ సరిగ్గా లేక చాలా క్రిములు, బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధనలో తేలిందని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. ప్రజల ఆరోగ్యానికి ఇది ఎంతో ప్రమాదకరమని గుర్తించామని వివరించింది. మయోనైజ్ వినియోగం కారణంగా అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

ఈ కారణంగానే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 కింద ఈ నిషేధం విధించామని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మయోనైజ్ పై నిషేధం విధించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications