వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: తమిళనాడు 8 ముక్కలు, ఆలయాలు, మసీదులు, చర్చిలు క్లోజ్, తేడా వస్తే గోవిందా గోవింద !

|
Google Oneindia TeluguNews

చెన్నై/న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) లో భాగంగా దేశంలో అమలులోకి వచ్చిన లాక్ డౌన్ 5.0 పందర్బంగా తమిళనాడును 8 ముక్కలు చేశారు. ప్రజల అవసరాలు, రవాణా సమస్యలు పరిష్కారం కోసం తమిళనాడును 8 ముక్కలు చెయ్యాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 24వ తేదీ అర్దరాత్రి నుంచి నిలిచిపోయిన రవాణా సేవలతో పాటు మరికొన్ని సేవలు అందించడానికి తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని 8 ముక్కలు చెయ్యాలని నిర్ణయించింది. ఇక తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాధి కేసులు ఎక్కువ కావడానికి కారణం అయిన కోయంబేడు మార్కెట్ ఉన్న చెన్నై సిటీ తోపాటు మరికొన్ని జిల్లాలు రెడ్ జోన్లలోకి వెళ్లిపోయాయి. చిన్నా తేడా వస్తే గోవిందా గోవింద అనాల్సి వస్తుందని, తరువాత ఆ దేవుడే మనల్ని కాపాడాలని కొందరు ప్రభుత్వ పెద్దలు అంటున్నారు.

Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?

 విమానాల టేకాఫ్ దెబ్బ

విమానాల టేకాఫ్ దెబ్బ

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో దేశవ్యాప్తంగా మార్చి 24వ తేదీ అర్దరాత్రి నుంచి లాక్ డౌన్ అమలు అయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ దెబ్బతో దేశం మొత్తం రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే సమయంలో దేశీయ విమాన సర్వీసులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆర్ టీసీ సేవలు ప్రారంభించారు. అయితే తమిళనాడులో మాత్రం ఆర్ టీసీ బస్సులు రోడ్ల మీదకు రాలేదు. తమిళనాడులో విమానాలు టేకాఫ్ కావడంతో జూన్ 1వ తేదీ సోమవారం నుంచి రవాణా సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.

 ఆర్ టీసీ డ్రైవర్లు, కండెక్టర్లు

ఆర్ టీసీ డ్రైవర్లు, కండెక్టర్లు

లాక్ డౌన్ 5.0 జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు అమలులో ఉంటాయి. ఇదే సమయంలో తమిళనాడులో రవాణా సేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం ఆర్ టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులను రోడ్ల మీదకు తీసుకువచ్చింది. సోమవారం నుంచి ఆర్ టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు రోడ్ల మీదకు వచ్చాయి. డ్రైవర్లు, కండెక్టర్లకు థర్మల్ స్క్రీనింగ్ అనుమతించారు. మూడు సీట్లలో ఇద్దరు, రెండు సీట్లలో ఒక్కరు కుర్చుని ప్రయాణించడానికి తమిళనాడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 కరోనా హాట్ స్పాట్ చెన్నై సిటీ

కరోనా హాట్ స్పాట్ చెన్నై సిటీ

తమిళనాడులో ఆదివారం వరకు నమోదైన కరోనా వైరస్ కేసుల వివరాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం వెళ్లడించింది. తమిళనాడులో మొత్తం 22, 333 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. తమిళనాడులో కరోనా హాట్ స్పాట్ అయిన చెన్నై సిటీలో ఏకంగా 14, 802 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఒక్క ఆదివారం మాత్రమే తమిళనాడులో 1, 149 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో చెన్నై సిటీలో 804 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ నగర ప్రజలు హడలిపోయారు.

 తమిళనాడు 8 ముక్కలు

తమిళనాడు 8 ముక్కలు

చెన్నై సిటీతో పాటు ఆ నగరం శివార్లలోని చెంగల్పట్టు కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. లాక్ డౌన్ 5.0 అమలులోకి వచ్చిన సమయంలో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాలో లాక్ డౌన్ ను మరింత కఠినతరం చేశారు. లాక్ డౌన్ 5.0 సడలింపుల్లో భాగంగా తమిళనాడులో అనేక జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. తమిళనాడులను 8 జోన్లుగా విభజించారు. ఆర్ టీసీ బస్సులు ఆ జోన్ల పరిధిలోనే సంచరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 చెన్నైలో 70 MM సినిమా

చెన్నైలో 70 MM సినిమా

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాలు జోన్ 8 పరిధిలోకి వచ్చాయి. చెన్నై సిటీలోని ప్రజలు ఇతర జిల్లాలకు వెళ్లాలన్నా, ఇతర జిల్లాల వారు చెన్నైలోకి రావాలన్నా ఇ -పాస్ కచ్చితంగా ఉండాలని ప్రభుత్వం స్పస్టం చేసింది. చెన్నై సిటీలోని ప్రజలకు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఇక చెన్నైలోకి ఇతర ప్రాంతాల ప్రజలు ఎందుకు వస్తున్నారు ? ఎందుకు బయటకు వెలుతున్నారు ? అని అధికారులకు కచ్చితంగా సమాచారం ఇవ్వాలని, ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

 ఆలయాలు, మసీదులు, చర్చిలు క్లోజ్

ఆలయాలు, మసీదులు, చర్చిలు క్లోజ్

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రార్థనలు, మత సంబంధిత అన్ని కార్యక్రమాలకపై నిఫేధం కొనసాగుతుందని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక తమిళనాడులో ప్రముఖ పర్యాటక కేంద్రాలు అయిన కొడైకెనాల్, ఏర్పేడు, నీలగిరి తదితర పర్యాటక కేంద్రాల్లో సంచారన్ని పూర్తిగా నిషేధించింది.

Recommended Video

COVID-19 Cases Crossed 3045 Mark In AP, 98 New Cases Registered In 24Hrs
 తేడా వస్తే గోవిందా గోవింద

తేడా వస్తే గోవిందా గోవింద

లాక్ డౌన్ 5.0 సందర్బంగా తమిళనాడులోనే కొన్ని సడలింపులు ఇచ్చిన కొన్ని జోన్లలో కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ 5.0 సందర్బంగా కఠిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చెయ్యిదాటి పోతుందని, తరువాత గోవిందా గోవింద అన్నా ఎలాంటి ఫలితం ఉండదని, తరువాత ఆదేవుడే మనల్ని కాపాడాలని కొందరు ప్రభుత్వ పెద్దలు అంటున్నారు.

English summary
Lockdown: Tamil Nadu Government separates the state into 8 zones for Public transport. Movement of buses ply between zones, There is no need of Epass.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X