Tamil Naduలో మూడో వేవ్ భయం -19 వరకు lockdown పొడగింపు -కొత్తగా 2,913కేసులు, 49 మరణాలు

తమిళనాడులో కరోనా మహమ్మారి రెండో దశ విలయం తగ్గుముఖం పడుతున్నప్పటికీ, మూడో వేవ్ ముప్పు తప్పదనే భయాల నడుమ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది. భారీ సడలింపులతో జులై 19వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు స్టాలిన్ సర్కారు శనివారం ప్రకటించింది.

తమిళనాట లాక్‌డౌన్‌ పొడగించినప్పటికీ, భారీగా సడలింపులు కల్పించారు. అందులో భాగంగా రెస్టారెంట్లు, టీ దుకాణాలు, బేకరీలు, స్ట్రీట్ వెండర్లు, స్వీట్ షాపులకు మరో గంటపాటు సడలింపు ఇచ్చారు. 50శాతం కస్టమర్లతో రాత్రి 9గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచుకొనేందుకు అవకాశం కల్పించారు. ఏసీ వినియోగించే ఆఫీసుల్లో తగిన వెంటిలేషన్‌ ఉండేలా జాగ్రత్త వహించాలని ప్రభుత్వం సూచించింది. కాగా,

Tamil Nadu govt extends Covid lockdown till July 19; 2,913 new cases, 49 deaths

కొవిడ్ రెండో దశ తీవ్రత తగ్గిన దరిమిలా సినిమా థియేటర్లకు సడలింపులు లభిస్తాయని అంతా భావించినా సర్కారు మాత్రం అందుకు నో చెప్పింది. స్కూళ్లు, కాలేజీలు, బార్‌లు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, జూలు మూసే ఉంటాయని, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలకు అనుమతించలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెళ్లిళ్లకు 50మంది, అంత్యక్రియలకు 20మంది మించరాదని ప్రభుత్వం నిబంధనలు విధించింది.

తమిళనాడులో శనివారం కొత్తగా 2,913 కొత్త కేసులు, 49 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 25.14 లక్షల కేసులు నమోదయ్యాయి. వీరిలో 24.49లక్షల మందికి పైగా కోలుకోగా, 33,371మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 32,7674 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+