కూతురిపై తండ్రి రేప్: షాకిచ్చిన భార్య, 4 జీవిత ఖైదులు విధించిన కోర్టు
చెన్నై: మానసిక వికలాంగురాలైన 17 ఏళ్ళ కూతురిని తల్లిని చేసిన తండ్రికి తంజావూరు మహిళా కోర్టు నాలుగు జీవిత ఖైదులను విధిస్తూ తీర్పు చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది.
వావి వరుసలు మర్చిపోయి అత్యాచారాలు చేస్తున్న ఘటనలు అనేకం వింటున్నాం, చూస్తున్నాం. అదే తరహా ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. కన్న కూతురిపైనే తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.
తమిళనాడులోని తంజావూరు జిల్లా శివకొల్లై ప్రాంతానికి చెందిన సుబ్రమణి అనే వ్యక్తి పెయింటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతను తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయట చెబితే చంపేస్తామని హెచ్చరించాడు.

కూతురిపై రేప్
తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా శివకొల్లై ప్రాంతానికి చెందిన సుబ్రమణి అనే వ్యక్తి పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతని వయస్సు 50 ఏళ్ళు. అతనికి 17 ఏళ్ళ కూతురు ఉంది. ఆమె మానసిక వికలాంగురాలు. అయితే మానసిక వికలాంగురాలుగా ఉన్న కూతురిపై సుబ్రమణి తరచూ అత్యాచారానికి పాల్పడేవాడు. ఒకరోజు తల్లి ఆలయానికి వెళ్ళిన సమయంలో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు తర్వాత పలుమార్లు కూడ బాధితురాలిపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని హెచ్చరించాడు.

కడుపునొప్పితో వెళ్తే గర్భవతిగా తేల్చిన వైద్యులు
గత ఏడాది మార్చిలో తీవ్రమైన కడుపునొప్పి రావడంతో మానసిక వికలాంగురాలైన కూతురును తల్లి ఆసుపత్రికి తీసుకెళ్ళింది. అయితే వైద్యులు బాధితురాలిని పరీక్షించి గర్భవతిగా తేల్చేశారు. బాధితురాలు ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో బాధితురాలిని తల్లి నిలదీసింది. దీంతో అసలు విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పింది. తన భర్తే తన కూతురును గర్భవతిని చేశాడని తెలిసి ఆమె తట్టుకోలేకపోయింది.

భర్తపై ఫిర్యాదు చేసిన భార్య
తన కూతురిని భర్త సుబ్రమణి గర్భవతిని చేశాడని తెలిసిన భార్య తట్టుకోలేకపోయింది.భర్త సుబ్రమణిపై పట్టుక్కోట్టై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి పిర్యాదు మేరకు పోలీసులు సుబ్రమణిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించారు.

తంజావూరు కోర్టు తీర్పు
కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన సుబ్రమణిపై తంజావూరు మహిళా కోర్టు ఏడాది పాటు విచారణ చేసింది. ఈ మేరకు నిందితుడిపై ప్రాసిక్యూషన్ అభియోగాలను నిరూపించడంతో కోర్టు నాలుగు జీవిత ఖైదులను విధిస్తూ తీర్పును వెలువరించింది. జీవిత ఖైదులతో పాటు బెదిరింపులకు పాల్పడినందుకు ఆరు మాసాల పాటు జైలు శిక్షను విధిస్తూ న్యాయమూర్తి బాలకృష్ణన్ తీర్పు వెలువరించారు. చనిపోయేవరకు శిక్షను అనుభవించాలని కోర్టు తీర్పు చెప్పింది.












Click it and Unblock the Notifications