అద్వానీ హత్యకు బాంబులు ఇచ్చింది ఓ ఉపసర్పంచ్!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ హత్యకు బాంబులు సరఫరా చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తిరునల్వేలి జిల్లాలోని పుదుక్కూడి గ్రామ ఉప సర్పంచ్ డేనియల్ ప్రకాష్ (35)ను కర్ణాటక పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో బీజేపీ కార్యాలయం సమీపంలో 2013 సంవత్సరంలో అద్వానీ లక్ష్యంగా బాంబు దాడి జరిగింది. ఈ కేసులో అల్ ఉమా ఉగ్రవాద సంస్థకు స్లీపర్ సెల్స్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో డేనియల్ ప్రకాష్ కనీసం మూడు సందర్భాలలో అల్ ఉమా ఉగ్రవాదులకు పేలుడు పదార్థాలు సరఫరా చేసినట్లు గుర్తించారు.

2011లో మదురైకి 30 కిలోమీటర్ల దూరంలో గల ఆలంపట్టి గ్రామంలో ఓ వంతెన కింద బాంబులు పెట్టి పేల్చేందుకు అల్ ఉమా ఉగ్రవాదులు ప్రయత్నించారు. అప్పుడు కూడా బాంబులు సరఫరా చేసింది ఇతడే కావడం గమనార్హం.
కాగా, అత్యంత శక్తిమంతమైన పైపు బాంబులను పోలీసులు ముందుగానే గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు. మరోసారి 2012 సంవత్సరంలో తిరునల్వేలి జిల్లాలో జరిగిన పేలుళ్లలో ఉపయోగించిన బాంబులను కూడా ప్రకాషే సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications