ప్రధాని పేరు తెలియని మంత్రి ఉండటం సిగ్గుచేటు: ఆమె మహారాణిలా ఫీలైపోతున్నారు !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరు గుర్తు లేని వ్యక్తి తమిళనాడు రాష్ట్రానికి మంత్రిగా ఉండటం సిగ్గుచేటు అని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈవీకేఎస్, ఇళంగోవన్ మండిపడ్డారు. తమిళనాడు అటవి శాఖ మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ ప్రధాని మన్మోహన్ సింగ్ అని చెప్పిన విషయం తెలిసిందే.

తమిళనాడు మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ బహిరంగ సభలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అని చెప్పి నవ్వులపాలైనారు. ఈ విషయంపై సోమవారం కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్. ఇళంగోవన్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి పేరు బహిరంగ సభలో తప్పు చెప్పిన మంత్రిగా ఉండటం మన కర్మ అన్నారు.

Tamil Nadu Minister don’t even PM’s name

ఆయన రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విషయం ఎలా గుర్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు. బీజేపీ తమిళనాడు శాఖ బీజేపీ అధ్యక్షురాలు తిమిళిసై సౌందరరాజన్ మీద ఇదే సమయంలో ఈవీకేఎస్. ఇళంగోవన్ విమర్శలు చేశారు. తమిళిసై సౌందరాజన్ ఆమెకు ఆమె ఒక మహారాణిలాగా ఫీలైపోతున్నారని ఆరోపించారు.

తమిళనాడు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసి తరువాత కాంగ్రెస్ పార్టీని విమర్శించాలని కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్ ఇంళగోవన్ సూచించారు. తమిళనాడు మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ మీద తమిళనాడులోని ప్రతిపక్ష నాయకులు వ్యంగంగా విమర్శిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Known for his blistering remarks, former union minister and senior Congress leader EVKS Elangovan on Monday came down heavily on Tamil Nadu forests minister Dindigul C Srinivasan for referring Manmohan Singh as the prime minister. Speaking to the media, he said, "Tamil Nadu ministers don't even know who is the prime minister of the country. It is a shame.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి