రైతుల ధర్నా, మరోవైపు ఎమ్మెల్యేల జీతాలు 100 శాతం పెంపు
తమిళనాట రుణమాఫీ కోసం రోజుకో రకంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతు సమస్యలు పట్టించుకునే వారు లేరు. కానీ, ఓ వైపు రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ మరోవైపు ఎమ్మెల్యేల జీతాలు రెట్టింపు అయ్యాయి.
చెన్నై: తమిళనాట రుణమాఫీ కోసం రోజుకో రకంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతు సమస్యలు పట్టించుకునే వారు లేరు. కానీ, ఓ వైపు రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ మరోవైపు ఎమ్మెల్యేల జీతాలు రెట్టింపు అయ్యాయి.
ప్రస్తుతం వారికి ఇస్తున్న వేతనంలో పెంపు కావాలని ఏకంగా 100 శాతం పెంపును ప్రతిపాదిస్తూ తమిళనాడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. దీనిని ఎమ్మెల్యేలు ఆమోదించారు.

ఈ మేరకు బిల్లు ఆమోదం పొందినట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు రూ.55000 చొప్పున జీతం వచ్చేది.
ఈ బిల్లు ఆమోదం వల్ల నెలకు రూ. 1.05 లక్షల వేతనం రానుంది. రుణమాఫీ కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమిళ రైతులు రోజుకో రకంగా ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications