పతంజలి ఉత్పత్తులపై ముస్లిం సంస్థ ఫత్వా
చెన్నై: యోగా గురు బాబా రామ్‌దేవ్ పతంజలి ఉత్పత్తులపై ముస్లిం సంస్థ తమిళనాడు తౌహీద్ జమాత్ (టీఎన్‌టీజే) ఫత్వా జారీచేసింది. ప్రస్తుతం విపణి, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న సౌందర్య, ఆహార ఉత్పత్తులు, ఔషధాల తయారీలో ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తున్నారని టీఎన్‌టీజే పేర్కొంది.

ముస్లిం విశ్వాసాల ప్రకారం.. ఆవు మూత్రాన్ని ఉపయోగించడకూడదని, అందుకే పతంజలి ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది.
కొందరు ముస్లింలకు ఈ విషయాలు తెలియకపోవడం వల్ల వారు పతంజలి ఉత్పత్తులను రోజువారీగా ఉపయోగిస్తున్నారని తెలిపింది. అందుకే, ముస్లింలు వీటిపై అవగాహన కలిగి ఉండి పతంజలి ఉత్పత్తులను ఉపయోగించరాదని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications