ఆ టైంలో క్యాండీ ఆడుతూవీడియోకి చిక్కిన అధికారిణి

చెన్నై: ఓ వైపు రైతులు తమ సమస్యలు చెబుతుంటే, మరోవైపు తన స్మార్ట్ ఫోన్‌లో క్యాండీ క్రష్ అడుతూ అడ్డంగా దొరికిపోయింది ఓ అధికారిణి. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.

రైతుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు గ్రీవాన్స్ సెల్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులోని ధర్మపురిలో రైతులు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు.

ఈ సందర్భంగా ఓ వైపు తమ బాధలను రైతులు విన్నవిస్తుంటే.. సదరు అధికారిణి తన స్మార్ట్‌ఫోన్‌లో క్యాండీ క్రష్ సాగా గేమ్ ఆడుకుంటూ ఉండిపోయింది.

Tamil Nadu Officer Caught Playing Candy Crush on Phone at Farmers' Meet

ధర్మపురికి చెందిన డీఆర్ఓ స్థాయి అధికారిణి, కలెక్టర్ పక్కన వేదిక పైన కూర్చుని గేమ్ ఆడుకోవడంలో నిమగ్నమైంది. ఇతర అధికారులు రైతులు చెబుతున్న వివరాలు నోట్ చేసుకుంటున్న సమయంలో ఈమె అవేమీ పట్టనట్టు ఆడుతూ ఉండిపోయారు.

ఈ మొత్తం వీడియోను రెడ్ పిక్స్ యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ అయింది. మహిళా అధికారిణి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆమెపై శాఖాపరమైన చర్యలకు తమిళనాడు సర్కారు సిద్ధమైనట్టు సమాచారం. కాగా, సదరు అధికారిణి పేరు కవిత అని తెలుస్తోంది. ఆ సమయంలో ఆమె కలెక్టర్ పక్కన కూర్చున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+