తమిళనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల సామూహిక రాజీనామాలు: రాష్ట్రపతి పాలన, స్టాలిన్ ప్లాన్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దెదించాలని ఆ రాష్ట్ర శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ వెంటనే చెన్నై రావాలని పిలుపునిచ్చారు.

తమిళనాడు మాజీ మంత్రి రిసార్ట్ నుంచి ఎస్కేప్: దినకరన్ కు మద్దతు, చీటింగ్ కేసులో వేట !

తమిళనాడు శాసన సభలో ప్రజాప్రతినిధులకు విలువలేదని ఆరోపిస్తూ తన మిత్రపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులతో కలిసి ఎమ్మెల్యేలు అందరితో సామూహిక రాజీనామాలు చేయించాలని ఎంకే. స్టాలిన్ ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది.

Tamil Nadu opposition MLAs set to give mass resignation

మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో చెన్నైలోని డీఎంకే పార్టీ కార్యాలయంలో స్టాలిన్ అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనున్నారు. తమిళనాడు ప్రభుత్వం మీద ప్రజల్లో నమ్మకం పోయిందని, అదే ప్రజల తో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయించాలని డీఎంకే బావిస్తోంది.

దెబ్బ మీద దెబ్బ: 18 అసెంబ్లీ సీట్లు ఖాళీ, ఈసీకి లేఖ రాసిన తమిళనాడు ప్రభుత్వం, ఓకే !

అన్నాడీఎంకే పార్టీని పడగొట్టి తాము అధికారంలోకి రావాలని డీఎంకే పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు సామూహిక రాజీనామాలు చేస్తే రాష్ట్రపతి పాలన వస్తోందని, తరువాత ఎన్నికలు ఎప్పుడు జరిగినా కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని స్టాలిన్ ధీమాగా ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యేలతో చర్చించిన తరువాత స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని డీఎంకే పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a one more dramatic turn in Tamil Nadu politics, all opposition leaders have decided to give resignation to their MLA post.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X