సర్వీస్ పొడిగింపు కోసం పుట్టిన తేదీని మార్చిన ఐపీఎస్ అధికారి.. దొరికిపోయారు

చెన్నై: గతంలో పదవీ విరమణ తేదీని కొంతకాలం పొడిగించుకునేందుకు తమిళనాడులో న్యాయమూర్తులు పుట్టిన తేదీని మార్చి చూపినట్లు ఓ వార్తాకథనం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు జిల్లా న్యాయమూర్తులు హైకోర్టు జడ్జిలుగా ప్రమోషన్ తీసుకునేందుకు పుట్టినరోజుని మార్చి చూపారు.

అయితే తాజాగా తమిళనాడుకు చెందిన ఓ ఐపీఎస్ అధికారి సరిగ్గా ఇలాంటి పనే చేశారు. వివరాల్లోకి వెళితే, ఆయన పేరు ఎస్ రాజేంద్రన్. 1956లో పుట్టిన ఐపీఎస్ అధికారి ఎస్ రాజేంద్రన్ తాను జనవరి 15, 1959లో పుట్టినట్లు ఓ నకిలీ సర్టిఫికెట్ పుట్టించారు.

Tamil Nadu Top IPS officer writes to Centre after losing two rounds of litigation

తహసీల్దారు నుంచి 'రెక్టిఫైడ్' సర్టిఫికెట్ తీసుకొని దాన్ని ఎస్ఎస్ఎస్సీ (స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్)లో పొందుపరిచేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. పుట్టినరోజు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన 9 సంవత్సరాల తర్వాత రాజేంద్రన్ 1996లో సర్వీసులో చేరినట్లు తహసీల్దారు తెలిపారు.

అయితే తన పుట్టినరోజు ధ్రువీకరణ తప్పుగా ఉందని, తాను 1959లో జన్మించానని అటు ప్రభుత్వాన్ని, ఇటు కోర్టుని మోసగించి మరో మూడు సంవత్సరాల పాటు సర్వీసులో కొనసాగాలని యత్నించారు. దీనిపై విచారణ జరపాలని అధికారులకు మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+