లక్షలు దోచిన కి'లేడీ' హీరోయిన్: ఫోటోలు పంపిన నటి, ఫ్రెండ్స్ చెప్పింది విని షాకైన ఎన్నారై టెక్కీ

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: 21 ఏళ్ల నటి, ఆమె తల్లి, సోదరుడు తదితరులను సైబర్ క్రైమ్ పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు. వీరు జర్మనీకి చెందిన ఓ ఎన్నారై టెక్కీకి రూ.41 లక్షల మొత్తంల మోసం చేశారు. ఆ నటిని పోలీసులు శృతిగా గుర్తించారని తెలుస్తోంది.

ఈమె తమిళంలో విడుదల కానీ రెండు సినిమాలలో హీరోయిన్‌గా నటించినట్లుగా తెలుస్తోంది. తల్లి, సోదరుడు, మరొకరితో కలిసి వీరంతా కోయంబత్తూరులోని ఓ అపార్టుమెంటులో ఉంటున్నారని పోలీసులు గుర్తించారు.

 ఇద్దరూ నెంబర్స్ షేర్ చేసుకున్నారు

ఇద్దరూ నెంబర్స్ షేర్ చేసుకున్నారు

బాలమురుగన్ అనే వ్యక్తి సేలమ్ జిల్లాలోకు చెందిన వ్యక్తి. అతను జర్మనీలో ఓ కంపెనీలో సాఫ్టువేర్ ఉద్యోగి. అతను 2017 మేలో మ్యాట్రీమోనీ వెబ్ సైట్లో తన ప్రొఫైల్ పెట్టాడు. సదరు నటి అతనిని మైథిలి పేరుతో కాంటాక్ట్ చేసింది. వారిద్దరు మొబైల్ నెంబర్స్ షేర్ చేసుకున్నారు.

అతనికి ఫోటోలు పంపించింది

అతనికి ఫోటోలు పంపించింది

ఇరువురు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. సదరు నటి అతనికి తన ఫోటోలను కూడా చాలా పంపించింది. ఆ తర్వాత అతని ఖర్చులతో ఆ నటి యూకే వెళ్లి, అక్కడ అతనిని కలిసింది. ఆమె కోసం అతను లక్షలు ఖర్చు చేశాడు. అతను కూడా కోయంబత్తూరు వచ్చి ఆమెను కలిశాడు.

రూ.41 లక్షలు ఖర్చు చేశాడు

రూ.41 లక్షలు ఖర్చు చేశాడు


ఆ తర్వాత ఓసారి, తనకు బ్రెయిన్ ట్యూమర్‌కు చికిత్స జరుగుతోందని చెప్పింది. అలాగే తన తల్లికి హార్ట్ అలైన్మెంట్ చికిత్స ఉందని చెప్పింది. దీంతో అతను రూ.41 లక్షలు ఇచ్చాడు. గత ఏడాది మే తర్వాత నుంచి ఈ ఏడాది జనవరి 1వ తేదీ వరకు అతను రూ.41 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత నిశ్చితార్థం చేసుకుందామని అతను చెప్పాడు.

నిశ్చితార్థం ఇలా, స్నేహితులకు ఫోటోలు పంపడంతో

నిశ్చితార్థం ఇలా, స్నేహితులకు ఫోటోలు పంపడంతో

అయితే తన శరీరంపై కెమెరా ఫ్లాష్ లైట్లు పడవద్దని, కాబట్టి అవి లేకుండా చేసుకుందామని నటి అతనికి చెప్పింది. దీంతో ఎలాంటి ఆర్భాటం లేకుండా నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఆమె ఫోటోలను అతను తమిళనాడులోని తన స్నేహితులకు పంపించాడు.

పలువురిని మోసం చేసిందని తెలిసి ఆశ్చర్యం

పలువురిని మోసం చేసిందని తెలిసి ఆశ్చర్యం

ఆమె గురించి తన స్నేహితులు చెప్పింది విని అతను ఆశ్చర్యపోయాడు. ఆమె పలువురిని ఇలాగే మోసం చేసిందని చెప్పారు. దీంతో అతను సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకొని వారిని గురువారం అరెస్టు చేశారు. పోలీసులు కారు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఒక్కడినే కాకుండా, సంతోష్ కుమార్‌కు రూ.43 లక్షలు, శశికుమార్‌కు రూ.22 లక్షలు, సుందర్‌కు రూ.15 లక్షలు, అరుల్‌కు రూ.20 లక్షలు, రాజ్ కమల్‌కు రూ.21 లక్షలు వీరితో పాటు మరికొందరికి మోసం చేసినట్లుగా ఫిర్యాదులు అందాయి. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

గుట్టు విప్పిన హీరోయిన్

గుట్టు విప్పిన హీరోయిన్

ఇదిలా ఉండగా, పోలీసుల విచారణలో సదరు నటి ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. తనకు సినిమాల్లో సరైన అవకాశాలు రాక, రాణించలేకపోయినందున ఫేస్‌బుక్ మాద్యమంగా ధనవంతులైన యువకులను మోసం చేయాలని ఆలోచించినట్లు చెప్పిందని తెలుస్తోంది. తల్లి, సోదరుడి సహాయంతో ఈ పని చేశానని, విలాసవంతమైన జీవితానికి అలవాటుపడటంతో ఖర్చులు పెరిగాయని అంగీకరించిందని తెలుస్తోంది. తాను మొత్తం ఎనిమిదిమందిని మోసం చేసినట్లు తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Central Crime Branch of Coimbatore City police has arrested a young woman, her parents and brother on charge of duping an NRI engineer of Rs. 41 lakh by promising to marry him.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి