వివాహేతర సంబంధాలు: భర్తను చంపిన మహిళ
మధురై: తమిళనాడులో ఓ మహిళ అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 35 ఏళ్ల మహిళ గురువారం రాత్రి తన భర్తను హత్య చేసింది. గ్రైండింగ్ స్టోన్‌తో అతని తల పగులగొట్టి హత్య చేసింది. అతను నిద్రిస్తున్న సమయం చూసి అతని తలపై బాదింది. తమిళనాడులోని మధురై జిల్లా వాడిపట్టిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
మృతుడిని 38 ఏల్ల చెల్లపండిగా గుర్తించారు. భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేని మహిళ ఆ పనికి పూనుకుంది. అతనికి భార్య సెల్వి, 15 ఏళ్ల కుమారుడు, 14 ఏళ్ల కూతురు ఉన్నారు. భర్తను చంపిన మహిళ సెల్వి శుక్రవారంనాడు వాడిపట్టి పోలీసుల ముందు లొంగిపోయింది.

చెల్లపండి చేతబడి చేస్తూ ఉంటాడని, కొంత మంది మహిళలతో అతనికి వివాహేతర సంబంధాలున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో అతనికీ భార్యకు మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి.
గురువారం రాత్రి చెల్లపండి తాగి ఇంటికి వచ్చాడు, భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత కొద్ది సేపటికి చెల్లపండి పడుకున్నాడు. అతను నిద్రిస్తున్న సమయంలో భార్య గ్రైండింగ్ స్టోన్‌తో తల మీద బాదింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications