దెబ్బ మీద దెబ్బ: 18 అసెంబ్లీ సీట్లు ఖాళీ, ఈసీకి లేఖ రాసిన తమిళనాడు ప్రభుత్వం, ఓకే !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల మీద వరుసగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తమిళనాడులో 18 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయని ఆరాష్ట్ర సెక్రటేరియట్ అధికారులు భారత ఎన్నికల కమిషన్ కు అధికారికంగా లేఖ రాశారు.

రాష్ట్రపతితో గవర్నర్ విద్యాసార్ రావ్ భేటీ: 18 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల విషయం!

అన్నాడీఎంకే పార్టీ మీద తిరుగుబాటు చేసి అనర్హత వేటుకు గురైన 18 మంది ఎమ్మెల్యేలు మాజీలు అయ్యారని, ప్రభుత్వ వెబ్ సైట్ లో వారి పేర్లు, వివరాలు తొలగించాలని తమిళనాడు సెక్రటేరియట్ అధికారులు భారత ఎన్నికల కమిషన్ రాసిన లేఖలో వివరించారు.

Tamil Nadu writes EC declaring 18 constituencies vacant

18 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్వే హాస్టల్ (క్వాటర్స్) ఖాళీ చేయించాలని ఇప్పటికే స్పీకర్ ధనపాల్ ఆదేశాలు జారీ చేశారని సెక్రటేరియట్ అధికారులు భారత ఎన్నికల కమిషన్ కు సమాచారం ఇచ్చారు. భారత ఎన్నికల కమిషన్ తమిళనాడులోని 18 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

శశికళతో రెబల్ ఎమ్మెల్యేల భేటీ: దినకరన్ ను నమ్ముకుని రోడ్డునపడ్డామని ఆవేదన!

భారత ఎన్నికల కమిషన్ 18 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయని అధికారికంగా ప్రకటిస్తే దీనకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యేలు కచ్చితంగా మాజీ ఎమ్మెల్యేలు అవుతారు. గవర్నర్ విద్యాసాగర్ రావ్ చెన్నై చేరుకున్న తరువాత మాకు అన్యాయం జరిగిందని టీటీవీ దినకరన్ ఆయన్ను కలిసే అవకాశం ఉందని సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Tamil Nadu Assembly secretariat on Monday informed the Election Commission of India that 18 constituencies in the state are vacant, following disqualification of rebel MLAs.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి