మోడీతో భేటీ: పాపం తమిళనాడు సీఎం, కేవలం రెండు నిమిషాల్లో కథ క్లోజ్ !
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి ఢిల్లీలో చేదుఅనుభవం ఎదురైయ్యిందని వెలుగు చూసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర తన మనసులోని బాధ చెప్పడానికి ప్రయత్నించిన తమిళనాడు సీఎం పళనిసామి విఫలం అయ్యారని వెలుగు చూసింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామితో ఎక్కువ సేపు మాట్లాడటానికి ప్రధాని నరేంద్ర మోడీ పెద్దగా ఆసక్తి చూపించలేదని వెలుగు చూసింది. అయితే నిరుత్సాహంతో చెన్నై వెనుతిరిగిన పళనిసామి ఇక ఏం చెయ్యాలి అంటూ తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు.

నాయకులతో తీరకలేకుండా
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి నీతి అయోగ్ సమావేశంలో పాల్గోనడానికి వెళ్లే ముందు చెన్నైలో బిజీబిజీగా గడిపారు. పన్నీర్ సెల్వం వర్గంతో రాజీ అయ్యి రెండు వర్గాలను విలీనం చెయ్యడానికి కసరత్తలు చేశారు.

సేలం జిల్లాలో ఫ్యామిలీ ఇలా
శనివారం ఎడప్పాడి కుటుంబ సభ్యులు సేలం జిల్లాలో కులదైవంకు యాగం, ప్రత్యేక పూజలు చేశారు. పళనిసామికి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఆయనే సీఎంగా కొనసాగాలని ప్రత్యేక పూజలు చేశారు.

మోడీతో సీఎం పళనిసామి
ఆదివారం ఢిల్లీలో జరిగిన నీతి అయోగ్ సమావేశంలో పాల్గోన్న ఎడప్పాడి పళనిసామి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడారు. ఎక్కడ ఆయన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా మెతకవైఖరితో జాగ్రత్తగా వ్యవహరించారు.

బీజేపీ జోక్యం చేసుకుంటుందని
తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ జోక్యం చేసుకుంటోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించాలని పళనిసామి అనుకున్నారు. అంతే కాకుండ ప్రస్తుత తమిళనాడు రాజకీయాల గురించి మోడీకి వివరించాలని పళనిసామి ముందుగానే పక్కా ప్రణాళిక సిద్దం చేసుకుని ఢిల్లీ వెళ్లారు.

కేరళ గవర్నర్ సహాయంతో
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, కేరళ గవరన్నర్ సదాశివం సహాయంతో మోడీతో భేటీకావడానికి పళనిసామి ప్రయత్నించారు. ఎట్టకేలకు మోడీ ఎడప్పాపడి పళనిసామికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయితే అక్కడ అనుకున్నట్లు పళనిసామి మోడీతో పూర్తి వివరాలు మాట్లాడలేకపోయారు.

రెండు నిమిషాలు
పళనిసామితో భేటీకీ మోడీ కేవలం రెండు నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారు. ఆ రెండు నిమిషాల్లో పళనిసామి వినతిపత్రం ఇవ్వడానికి సరిపోయింది. తమిళనాడు రాజకీయాలు, అన్నాడీఎంకే వర్గాల విలీనం విషయాల గురించి మోడీతో చర్చించడానికి అవకాశం లేకపోవడంతో పళనిసామి ప్రయత్నం నీరుకారిపోయిందని తెలిసింది.

అదే కారణం
మొదటి నుంచి ప్రధాని మోడీ పన్నీర్ సెల్వంకు వైపు మొగ్గుచూపుతున్నారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే పళనిసామితో మాట్లాడటానికి మోడీ ఎక్కువ సమయం కేటాయించలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మోడీతో చర్చించడానికి ప్రయత్నించి
నరేంద్ర మోడీతో పలు విషయాలపై చర్చించడానికి ప్రయత్నించిన పళనిసామి విఫలం అయ్యారని తెలుసుకున్న పన్నీర్ వర్గం సంతోషంలో మునిగిపోయింది. ఎప్పటికైనా ఢిల్లీలో మా నాయకుడు పన్నీర్ సెల్వంకే పట్టు ఉంటుందని మరోసారి రుజువు అయ్యిందని అంటున్నారు.

ఏం చేద్దాం అంటూ
ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న పళనిసామి ఇప్పుడు మళ్లీ పన్నీర్ సెల్వంతో రాజీ విషయంపై చర్చించడానికి సిద్దం అవుతున్నారు. పళనిసామి వర్గీయులు, పన్నీర్ సెల్వం వర్గీయులు వేరువేరుగా మంతనాలు జరుపుతూ బిజీబిజీగా ఉన్నారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications