వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు సీఎం పళనిసామి కుటుంబ సభ్యుల యాగం: ఏం జరగరాదని !

ఎడప్పాడికి పళనిసామికి రాజకీయంగా పన్నీర్ సెల్వం ఎత్తులు పైఎత్తులు వేస్తున్న సమయంలో పళనిసామి కుటుంబ సభ్యులు సేలం జిల్లాలోని ఎడప్పాడిలో తమ కుల దైవంకు ప్రత్యేక పూజలు, హోం, యాగం చేశారు.

|
Google Oneindia TeluguNews

సేలం: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి కుటుంబ సభ్యులు శనివారం ప్రత్యేక పూజలు, హోమం, యాగం చేశారు. ఎడప్పాడికి పళనిసామికి రాజకీయంగా పన్నీర్ సెల్వం ఎత్తులు పైఎత్తులు వేస్తున్న సమయంలో పళనిసామి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.

సేలం జిల్లాలోని ఎడప్పాడి ఊరిలో శనివారం ఉదయం నుంచి పళనిసామి కుటుంబ సభ్యులు ప్రసిద్ది చెందిన దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే ఎడప్పాడిలో జరుగుతున్న ప్రత్యేక పూజలకు పళనిసామి హాజరుకాలేదు.

విశ్రాంతి లేకుండా

విశ్రాంతి లేకుండా

చెన్నైలో పళనిసామి విశ్రాంతి లేకుండా రాజకీయాల గురించి చర్చలు జరుపుతున్నందువలన ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించిన ప్రత్యేక పూజలకు హాజరుకాలేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.

అన్ని అనుకున్నట్లు జరగాలని

అన్ని అనుకున్నట్లు జరగాలని

రాజకీయంగా ఎలాంటి అడ్డుంకులు లేకుండా ఎడప్పాడి పళనిసామి ముఖ్యమంత్రిగా కొనసాగాలనే ఆయన కుటుంబ సభ్యులు తమ కులదైవంకు ప్రత్యేక పూజలు చేశారని సమాచారం. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ప్రత్యేక కమిటీతో

ప్రత్యేక కమిటీతో

శనివారం తన వర్గంలోని సీనియర్ నాయకులతో మంతనాలు జరిపిన పళనిసామి అన్నాడీఎంకే రెబల్ నాయకుడు పన్నీర్ సెల్వం వర్గంతో విలీనం విషయంపై చర్చలు జరపడానికి ప్రత్యేక కమిటీ వేశారు.

సలహాలు, సూచనలు ఇచ్చి

సలహాలు, సూచనలు ఇచ్చి

ఢిల్లీకి వెలుతున్న సందర్బంగా పళనిసామి తమ వర్గంలోని నాయకులు సలహాలు, సూచనలు ఇచ్చారని సమాచారం. పన్నీర్ సెల్వం వర్గంతో నోరుజారి మాట్లాడకూడదని తన వర్గంలోని నాయకులు పళనిసామి సూచించారని తెలిసింది.

ఢిల్లీలోనే దినకరన్, పళనిసామి

ఢిల్లీలోనే దినకరన్, పళనిసామి

క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు హాజరుకావడానికి టీటీవీ దినకరన్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు పళనిసామి నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీ బయలుదేరారు. అయితే పళనిసామి దినకరన్ ను దూరంపెట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని ఆయన వర్గీయులు అంటున్నారు.

English summary
TamilNadu Chief Minister Edappadi Palanisamy's family members will hold special Yagam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X