జల్లికట్టు దెబ్బ: ప్రధాని మోడీతో పన్నీర్ సెల్వం: ఏం చెప్పారంటే !

న్యూఢిల్లీ: జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. జల్లికట్టు కోసం అర్డినెన్స్ జారీ చెయ్యాలని పన్నీర్ సెల్వం మనవి చేశారు.

ఢిల్లీ చేరుకున్న పన్నీర్ సెల్వం ప్రధాని మోడీని ఆయన నివాసంలో కలిశారు. జల్లికట్టు కోసం తమిళనాడులో ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో మీరే చోరవ తీసుకోవాలని పన్నీర్ సెల్వం విజ్ఞప్తి చేశారు.

ఇటీవల జల్లికట్టు విషయంపై పన్నీర్ సెల్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని తమిళనాడులో వరుసగా మూడో రోజు ఆందోళనలు చేస్తున్నారు.

TamilNadu government in Jallikattu issue

విద్యార్థులు రంగంలోకి దిగడంతో వారికి మద్దతుగా తమిళనాడులోని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సినిమా షూటింగ్ లు రద్దు చేసి జల్లికట్టుకు మద్దతు తెలిపారు. చెన్నైలోని మెరీనా బీచ్ లో వేలాది మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

తమిళ ప్రజలు సంప్రదాయ సాహస క్రీడగా భావించే జల్లికట్టు సంక్రాంతి సందర్బంగా నిర్వహిస్తారు. అయితే సుప్రీం కోర్టు జల్లికట్టుపై నిషేదం విధించింది. తమిళనాడు ప్రజలు, పార్టీలకు అతీతంగా వస్తున్న డిమాండ్లను పరిశీలించి ఆర్డినెన్స్ జారీ చెయ్యాలని పన్నీర్ సెల్వం ప్రధాని మోడీకి మనవి చేశారు. త్వరలోనే తమ నిర్ణయం ప్రకటిస్తామని మోడీ పన్నీర్ సెల్వంకు హామీ ఇచ్చారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+