వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాటర్ ట్యాంకులో మలం..భయాందోళనలో ప్రజలు, తీవ్ర అనారోగ్యంతో చిన్నారులు..!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తాగునీటి ట్యాంక్‌లో మలం మానవ వ్యర్థాలు బయటపడిన ఘటన తమిళనాడులోని పుదుకొట్టైలో చోటుచేసుకుంది. షెడ్యూలు కులాలకు చెందిన ఓ వాటర్ ట్యాంక్‌లో మానవ మలం ఉండటం అక్కడి స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటన పై ఫిర్యాదు అందడంతో అక్కడి పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లిన అధికారులు షాక్ అయ్యారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినప్పటికీ ఈ గ్రామంలో ఉన్న అంటరానితనంను చూసి ఉన్నతాధికారులు విస్మయానికి గురయ్యారు.

వాటర్ ట్యాంకులో మానవ వ్యర్థాలు

వాటర్ ట్యాంకులో మానవ వ్యర్థాలు

ఇక అసలు విషయానికొస్తే పెరియార్ ఉద్యమానికి నిలయమైన తమిళనాడులోని ఒక గ్రామంలో దాదాపు 100 దళిత కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ దళిత వర్గాలకు తాగునీరు సరఫరా చేసేందుకు అక్కడ 10వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఒక వాటర్ ట్యాంక్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్యాంకులో మానవ వ్యర్థాలు డంప్ అయి ఉండటం ఒక్కసారిగా అందరని భయాందోళనకు గురిచేసింది. ఇక్కడ నివసిస్తున్న దళితులను సాధారణంగా ఆలయాల్లోకి అనుమతించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక్కడి టీ దుకాణాలు చూసిన అధికారులు మరింతగా షాక్ అయ్యారు. అక్కడ టీ దుకాణాల్లో దళితుల కోసం ప్రత్యేకమైన గ్లాసులు ఉంచారు. దళిత వర్గాలకు చెందిన వారు టీ తాగాలంటే ఆ ప్రత్యేకమైన గ్లాసుల్లోనే తాగాలి. దీనిపై పుదుకొట్టై జిల్లా కలెక్టర్ కవితా రాము జిల్లా ఎస్పీ వందితా పాండేలకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు.

అనారోగ్యంతో చిన్న పిల్లలు

అనారోగ్యంతో చిన్న పిల్లలు

ఈ మధ్యకాలంలో ఆ గ్రామంలో నివసిస్తున్న చిన్న పిల్లలు తీవ్ర అనారోగ్యంకు గురవుతుండటంతో సమస్య ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు అధికారులు. చిన్నారులను పరీక్షించిన డాక్టర్లు తాగునీటి కలుషితమై ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆ గ్రామంలోని వాటర్‌ ట్యాంక్‌ను స్థానికులు ఎక్కి పరిశీలించగా ఆ ట్యాంకులోని నీళ్లు మొత్తం కలుషితమై ఉండటాన్ని గమనించారు. అందులో పెద్ద ఎత్తున మానవ వ్యర్థాలు, మలం ఉండటాన్ని గమనించారు. మొత్తం నీళ్లు అన్నీ పసుపు రంగులోకి మారిపోయి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇది తెలియని గ్రామస్తులు ఒక వారంకు పైగా ఈ నీటినే తాగారు. దీంతో చిన్నారులు తీవ్ర అనారోగ్యంకు గురయ్యారు. దీంతో అసలు విషయం బయటపడిందని మోక్ష గుణవలగన్ అనే వ్యక్తి చెప్పారు. అయితే ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

వాటర్ ట్యాంక్ పై ఎక్కి షాక్ అయిన యువకుల

వాటర్ ట్యాంక్ పై ఎక్కి షాక్ అయిన యువకుల

వాటర్‌ ట్యాంక్‌ను చెక్ చేసేందుకు పైకి ఎక్కిన యువకులకు ఆ ట్యాంక్ చుట్టూ ఉన్న కంచె తొలగిపోయి ఉండటం కనిపించింది.అంతేకాదు ట్యాంక్‌కు ఉన్న మూత కూడా తెరిచే ఉన్నట్లు గమనించారు. అయితే అంత ఎత్తులో ఉండే ట్యాంకుపైకి ఎవరు ఎక్కడాన్ని గ్రామస్తులు గమనించలేదని కలెక్టర్ కవిత రాము పేర్కొన్నారు. అయితే ఇక్కడ కుల వివక్ష తారాస్థాయిలో ఉందని స్థానికులు చెప్పినట్లు కలెక్టర్ కవితా రాము వివరించారు. దాదాపుగా మూడు తరాల నుంచి ఇక్కడి దళితులను ఆలయంలోకి అనుమతించడం లేదని చెప్పారు. దళితులు టీ దుకాణాల్లో టీ తాగాలంటే ప్రత్యేకమైన గ్లాసుల్లో ఇస్తారని వివరించారు.టీ దుకాణాదారుడిపై కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.అంతేకాదు ఆ గ్రామంలో నివసించే దళితులందరినీ అక్కడి ఆలయం వద్దకు తీసుకెళ్లిన కలెక్టర్, జిల్లా ఎస్పీలు... దళితులను ఆలయంలోకి రానివ్వకుండా అడ్డుకున్నది ఎవరో గుర్తించాల్సిందిగా కోరారు.

ఆ గ్రామంలో కులవివక్ష

ఆ గ్రామంలో కులవివక్ష

డిగ్రీ చేసిన 22 ఏళ్ల సింధూజ తాను చిన్నప్పటి నుంచి ఆ గ్రామంలోనే నివసిస్తోందని ఎప్పుడూ తను ఆలయంలోకి వెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజు కలెక్టర్ తనను ఆలయంలోకి తీసుకెళ్లడం నిజంగా సంతోషంగా ఉందని వెల్లడించింది.ఇలా ఈ ఒక్క గ్రామంలోనే కాకుండా ఇంకా ఎక్కడెక్కడైతే దళితులను ఆలయాల్లోకి అనుమతించడం లేదో అక్కడకూడా కఠిన చర్యలు తీసుకుని అనుమతించేలా చూడాలని సింధూజ కోరింది.తాము కూడా ఆలయ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పుకొచ్చింది. తాను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ గ్రామంకు వచ్చినట్లు చెప్పిన ఓ వివాహిత... ఇప్పటి వరకు ఆలయంలో దేవుడు ఎలా ఉంటాడో చూడలేదని, కానీ ఇప్పుడు చూడటంతో చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఇది ఇలానే కొనసాగాలని ఆకాంక్షించింది. ఇదిలా ఉండగా మరో ప్రాంతం నుంచి నీరు తెచ్చినా శాశ్వత పరిష్కారం కాదనీ, మలం కలిపిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ను కూల్చివేసి కొత్త ట్యాంకు నిర్మించాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. దీంతో త్వరలో ట్యాంకును కూల్చివేసి కొత్త నీటి ట్యాంక్‌ను నిర్మించి ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు.

వాస్తవానికి వందేళ్ల క్రితమే అంటే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించకముందే రామసామి పెరియార్ దళితులకు ఆలయాల్లో ప్రవేశించేందుకు అనుమతించాలంటూ ఉద్యమించారు.ఈ ఉద్యమం నుంచే ద్రవిడ ఉద్యమం స్ఫూర్తి పొందింది. ఈ ద్రవిడ ఉద్యమమే నేటి తమిళనాడు రాజకీయాల్లో ఇంకా కీలక పాత్ర పోషిస్తోంది.

English summary
Human feces and waste have been dumped in a drinking water tank that belongs to Schedule castes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X