చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయ సక్సెస్ వెనుక, శశికళకు దూరంగా,సెలవులపై సీనియర్లు ఎందుకంటే?

సీనియర్ అధికారులు సెలవుపూ వెళ్తున్నారు..దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హయంలో పనిచేసిన సీనియర్ అదికారులు సెలవుపై వెళ్తున్నారు. లేదా తమ శాఖలను మార్చాలని కోరుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:దివంగత ముఖ్యమంత్రి జయలలిత వద్ద పనిచేసిన కీలకమైన అధికారులు సెలవుపై వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపడుతారనే సమాచారం రావడంతో అధికారులు సెలవుపై వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో నాటకీయపరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. అన్నాడిఎంకె శాసనసభపక్ష నాయకురాలిగా శశికళ ఎన్నికయ్యారు.

ఆమె శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన వెంటనే ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ఈ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు.

శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమం వాయిదా పడింది.ఆమెపై ఉన్న కేసుల విషయమై వారం రోజుల్లో తీర్పు వచ్చే అవకాశం ఉన్నందున వేచిచూసే ధోరణితో గవర్నర్ విద్యాసాగర్ రావు ఉన్నారు.

కీలక అధికారులు వెళ్ళిపోతున్నారు.

కీలక అధికారులు వెళ్ళిపోతున్నారు.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వద్ద పనిచేసిన అధికారులు ఒక్కొక్కరుగా సెలవుపై వెళ్ళిపోతున్నారు.హఠాత్తుగా అధికారులు సెలవుపై వెళ్లేందుకు అనుమతి కోరుతున్నారు.మరికొందరు తాము ప్రస్తుతం పనిచేస్తోన్న స్థానాల నుండి తప్పించాలని కోరుకొంటున్నారు. ఈ పరిణామాలన్నీ అన్నాడిఎంకె చీఫ్ శశికళకు ఇబ్బందికరంగా మారాయి.కీలక అధికారులు సెలవుపై వెళ్ళడం రాజకీయంగా ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశాలు లేకపోలేదని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడ్డుతున్నారు.

సీనియర్ అధికారులు ఇలా

సీనియర్ అధికారులు ఇలా

జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆమె వద్ద పనిచేసిన కీలకమైన అధికారులు ఒక్కొక్కరుగా సెలవులు పెడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ మాసంలోనే ఇంటలిజెన్స్ చీఫ్ గా సత్యమూర్తిని ప్రభుత్వం నియమించింది.అయితే ఆయన ఉన్నట్టుండి సెలవుపై వెళ్ళారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ,జయలలితకు సలహదారుగా ఉన్న షీలా బాలకృష్ణన్ కూడ సెలవు పెట్టాు.జయ ఆసుపత్రిలో ఉన్న కాలంలో ప్రభుత్వ వ్యవహరాలు సజావుగా సాగేలా ఆమె చూశారు.ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్ డి గా పనిచేసి, ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్న శాంతా షీలా నాయర్ సైతం తన పదవి నుండి తప్పుకోవడానికి సిద్దపడ్డారు.తనను ఈ విధుల నుండి తప్పించాలని ఆమె ముఖ్యమంత్రి సెల్వం కు లేఖ రాశారు.

జయకు ఆప్తులుగా ఉన్న అధికారులంతా దూరంగా

జయకు ఆప్తులుగా ఉన్న అధికారులంతా దూరంగా

జయలలిత ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉన్న అధికారులంతా ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. అంతేకాదు సెలవుపై వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు.అది కాకుండా తమ శాఖల నుండి తప్పించాలని కోరుతున్నారు.ప్రస్తుత హోంశాఖ కార్యదర్శి శాంతా షీలానాయర్ నలుగురు కార్యదర్శుల్లో ఒకరు. జయలలిత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా పేదలకు అందడంలో వీరందరి కృషి కీలకమైంది.అందుకే జయ సంక్షేమ పథకాలు సక్సెస్ అయ్యాయి.

మనసు ఒప్పుకోకే సెలవులపై

మనసు ఒప్పుకోకే సెలవులపై

జయలలిత వద్ద పనిచేసిన అధికారులు, శశికళ వద్ద పనిచేసేందుకుగాను ఇష్టపడడం లేదని కొందరు అన్నాడిఎంకె నాయకులు చెబుతున్నారు. ఈ కారణంగానే వారు సెలవుపై వెళ్తున్నారు. పైకి ఒక కారణంగా చెబుతున్నా లోపల మాత్రం ఇతర కారణాలను సాకుగా చూ,పుతూ సెలవులను కోరుతున్నారు ఉన్నతాధికారులు.జయకు పేరు రావడానికి కారణమైన పథకాలను సక్సెస్ పుల్ గా అమలు చేసిన అధికారులు లేకపోతే శశికళకు పాలనలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
tamilnadu senior ias officers going to on leave.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X