తమిళనాడు స్కూల్లో దారుణం-పెళ్లి వద్దందన్న కసితో ఏం చేశాడంటే ?

తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉన్న మల్లిపట్టినం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇవాళ ఓ దారుణ హత్య జరిగింది. 26 ఏళ్ల రమణి అనే స్కూల్ టీచర్ ను వ్యక్తిగత కక్షతో ఓ వ్యక్తి అదే స్కూల్లో కత్తితో పొడిచి చంపాడు. దీంతో స్కూల్లో పిల్లలంతా భయభ్రాంతులయ్యారు. ఈ ఘటన తమిళనాడులో రాజకీయంగా కూడా దుమారం రేపింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ హత్య జరిగిందంటూ విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

మల్లిపట్టినం స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న రమణికీ, స్థానికంగా ఉండే మదన్ అనే వ్యక్తికీ మధ్య సన్నిహిత సంబంధం ఉంది. అయితే వీరిద్దరి పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో కొంతకాలంగా వీరిద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. ఇవాళ హఠాత్తుగా స్కూలుకు వచ్చిన మదన్.. రమణిపై కత్తితో దాడికి దిగాడు. విద్యార్ధులు, స్కూలు సిబ్బంది చూస్తుండగానే ఆమెను కత్తితో పొడిచేశాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మదన్ ను అరెస్టు చేశారు.

tamilnadu woman teacher killed for refusing marriage proposal

కుటుంబ వ్యతిరేకత నేపథ్యంలో తాజాగా మదన్ చేసిన పెళ్లి ప్రతిపాదనను రమణి తిరస్కరించడంతో ఇద్దరి మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని పోలీసులు చెప్తున్నారు. దీంతో ఆవేశానికి లోనైన మదన్ రమణిని కత్తితో పొడిచి చంపాడని వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన రమణిని రక్షించే ప్రయత్నంలో విద్యార్థినులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయిందని పోలీసులు తెలిపారు. మదన్ ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

దీనిపై తమిళనాడులో రాజకీయంగా దుమారం రేగింది. ప్రతిపక్ష అన్నాడీఎంకే నేత పళనిస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. డిఎంకె ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టీచర్లు, డాక్టర్లు సహా రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదన్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం... ఈ ఘటనను ఖండించింది. ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+