టిప్పు జయంతి, పొర్న్ వీడియోతో మంత్రి: సీఐడీకి

బెంగళూరు: టిప్పు సుల్తాన్ జయంతి వేడకుల సందర్భంగా బహిరంగ వేదిక మీద తన మొబైల్ లో పోర్న్ వీడియోలు చూశారని కర్ణాటక విద్యాశాఖ మంత్రి తన్వీర్ సేఠ్ మీద వచ్చిన ఆరోపణలపై సీఐడీ సైబర్ సెల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు.

అయితే విద్యాశాఖ మంత్రి తన్వీర్ సేఠ్ ఎలాంటి తప్పు చెయ్యలేదని ప్రభుత్వానికి తెలిసిందని సిద్దరామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఐడీ అధికారులు దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చిన తరువాత తాను స్పందిస్తానని సిద్దు వివరించారు.

ఇటీవల రాయచూరులో జరిగిన టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల సందర్బంగా మంత్రి తన్వీర్ సేఠ్ బహిరంగ వేదిక మీద తన మొబైల్ లో పోర్న్ వీడియో చూశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Tanveer Sait was caught on camera watching obscene pictures !

జర్నలిస్టు మీద కేసు పెట్టిన మంత్రి

తన ప్రతిష్టను దెబ్బ తియ్యడానికి కొందరు ప్రయత్నించారని, వారికి సహకరించారని ఆరోపిస్తూ ఓ ప్రయివేట్ టీవీ చానల్ జర్నలిస్టు, కెమెరా మెన్ మీద మంత్రి తన్వీర్ సేఠ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీ జర్నలిస్టు, కెమెరా మెన్ మీద 504 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని ఓ పోలీసు అధికారి తెలిపారు.

తన మీద కక్ష తీర్చుకోవడానికి కొందరు ప్రయత్నించారని, వారికి వీరిద్దరు సహకరించి తప్పుడు వార్తలు ప్రసారం చేసి తన పరువు తీశారని ఆరోపిస్తూ మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మంత్రి తన్వీర్ సేఠ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తనకు ఇంకా తెలియదని, తెలిసిన తరువాత మాట్లాడుతానని సీఎం సిద్దరామయ్య అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+