Target: బస్సు కండెక్టర్ టూ మాజీ సీఎం పీఏ, గేట్ పాస్ ఇచ్చేసిన సిట్టింగ్ సీఎం, ఉమేష్ మైండ్ బ్లాక్ !
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప పీఏ ఉమేష్ కు ఆదాయపన్ను శాఖ అధికారులు ఇప్పటికే ఊహించని షాక్ ఇచ్చారు. ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ దెబ్బతో ఉమేష్ కు మైండ్ బ్లాక్ అయ్యింది. మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప పీఏ ఉమేష్ దిమ్మతిరిగిపోయింది. మీ సేవలు మాకు అవసరం లేదు, మీ పని మీరు చూసుకోండి అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన్ను విధుల నుంచి తప్పిస్తూ బసవరాజ్ బోమ్మయ్ ఆదేశాలు జారీ చేశారు. బీఎస్. యడియూరప్పతో పాటు ఆయన కుమారుడు బీవై. విజయేంద్రకు అంత్యంత సన్నిహితుల్లో ఒక్కడిగా గుర్తింపు తెచ్చుకున్న ఉమేష్ ఇంటిలో కీలమైన పత్రాలను ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరగడంతో ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. 2012 నుంచి యడియూరప్ప పీఏగా పని చేస్తున్న ఉమేష్ ను, ఆయనకు అత్యంతం సన్నిహితులుగా గుర్తింపు తెచ్చుకున్న కొందరు కాంట్రాక్టర్లను ఐటీ శాఖ అధికారులు టార్గెట్ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

అప్పకు అత్యంత సన్నిహితుడు
కర్ణాటక ఇరిగేషన్ శాఖలోని అనేక పథకాలకు కేటాయించిన నిధుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కృష్ణ భాగ్య జల మండలి కాంట్రాక్టు పనులు కేటాయించడటంతో గోల్ మాల్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఆదాయపన్ను చెల్లించలేదని, అక్రమంగా నగదు బదిలీ చేశారని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప పీఏ ఉమేష్ తో పాటు ఆయన అనుచరుల మీద ఆరోపణలు వచ్చిన సమయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే.

యడియూరప్ప ఫ్యామీలిలో అందరి దగ్గర గుడ్ బాయ్
బెంగళూరులోని ఉమేష్ ఇంటిలో, శివమొగ్గలోని ఆయనూరులోని ఇంటిలో ఏకకాలంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. బీఎస్. యడియూరప్పతో పాటు ఆయన కుమారులు బీవై. విజయేంద్ర, బీవై రాఘవేంద్రలకు అంత్యంత సన్నిహితుల్లో ఒక్కడిగా గుర్తింపు తెచ్చుకున్న ఉమేష్ కు ఇప్పుడు టైమ్ బ్యాండ్ అని తెలిసింది.

లీడర్స్ లో ప్రత్యేక గుర్తింపు
2012 నుంచి యడియూరప్ప పీఏగా ఉమేష్ పని చేస్తున్నాడు. ఉమేష్ బీఎస్. యడియూరప్ప పీఏగా చేరిన తరువాత ఆయన సుడి తిరిగిపోయింది. గత 9 సంవత్సరాల నుంచి బీఎస్. యడియూరప్ప పీఏగా ఉన్న ఉమేష్ కర్ణాటక బీజేపీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్రమంగా కాంట్రాక్టు పనులు కేటాయించడంలో ఉమేష్ కీలకపాత్ర పోషించాడని ఆరోపణలు ఉన్నాయి.

విధుల నుంచి తప్పించిన సిట్టింగ్ సీఎం
ప్రస్తుతం విదాన సౌధలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో (పొరుగు సేవలు ) ఉమేష్ విధుల్లో ఉన్నాడు. మీ సేవలు మాకు అవసరం లేదు, మీ పని మీరు చూసుకోండి అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన్ను విధుల నుంచి తప్పిస్తూ ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆదేశాలు జారీ చేశారు.

కండెక్టర్ టూ సీఎం పీఏ
ఉమేష్ బీఎంటీసీ (బెంగళూరు సిటీ బస్సులు)లో కండెక్టర్ అండ్ డైరెక్టర్ గా ఉద్యోగంలో చేరాడు. రాజకీయ నాయకులతో పరిచం పెంచుకున్న ఉమేష్ ఆయనూరు మంజునాథ్ కు మొదట పీఏగా చేరారు. తరువాత యడియూరప్ప పీఏగా చేరారు. యడియూరప్ప సీఎంగా ఉన్న సమయంలో, ఆయన పదవిలో లేని సమయంలో ఆయన దగ్గరే ఉండిపోయిన ఉమేష్ భారీ మొత్తంలో ఆస్తులు సంపాధించారని ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications