Target: వైజాగ్ టూ బెంగళూరు, రైలులో ఆయిల్ ముసుగులో ?, రూ. కోట్ల డ్రగ్స్ సీజ్, ఎవరు ?!
బెంగళూరు/విశాఖపట్టణం: ఇద్దరు యువకులకు పరిచయం అయ్యింది. ఇద్దరు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు అయినా ఒకే వర్గం వాళ్లు కావడంతో వారికి బాషతో ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. పీజీ ఓనర్ అని ఒకరు, యూట్యూబ్ నటుడు అని ఒకరు అందరితో పరిచయం పెంచుకున్నారు. పరిచయం అయిన యువకులకు మాయమాటలు చెప్పి వారికి డ్రగ్స్ సరఫరా చేస్తామని డీల్ మాట్లాడుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా నిర్జనప్రదేశంలో డ్రగ్స్ విక్రయిస్తూ కాలం గడుపుతున్నారు. సాయంత్రం దీపాలు వెలిగించే సమయంలో డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు. ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ నుంచి రైలులో ఐటీ హబ్ కు గప్ చుప్ గా కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

కేరళ కేటుగాడు... బంట్వాళ ?
కేరళకు చెందిన షిరోజ్, కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని బంట్వాళకు చెందిన అష్వక్ కు పరిచయం అయ్యింది. అష్వక్, షిరోజ్ ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు అయినా ఒకే వర్గం వాళ్లు కావడంతో వారికి బాషతో ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. కొంతకాలం షిరోజ్, అష్వక్ ఆర్థికలావాదేవీలు, అనేక వ్యాపారాల గురించి చర్చించుకున్నారు.

డ్రగ్స్ విక్రయిస్తే భలే లాభాలు
తాను బెంగళూరులో పీజీ ఓనర్ అని అష్వక్, యూట్యూబ్ నటుడు అని షిరోజ్ కొంతమందితో పరిచయం పెంచుకున్నారు. ఐటీ హబ్ బెంగళూరులో పరిచయం అయిన యువకులకు మాయమాటలు చెబుతున్న అష్వక్, షిరోజ్ వారికి డ్రగ్స్ సరఫరా చేస్తామని డీల్ మాట్లాడుకున్నారు. కాలేజ్ అబ్బాయిలు, కార్పోరేట్ కార్యాలయాల్లో పని చేస్తున్న వారిని టార్గెట్ చేసుకున్నారు.

పక్కాప్లాన్ తో అరెస్టు
గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరులోని అనేక ఏరియాల్లోని నిర్జనప్రదేశంలో డ్రగ్స్ విక్రయిస్తున్న షిరోజ్, అష్వక్ డబ్బులు సంపాధిస్తూ కాలం గడుపుతున్నారు. బెంగళూరులోని బేగూరు సమీపంలోని కోప్ప రోడ్డులో సాయంత్రం దీపాలు వెలిగించే సమయంలో డ్రగ్స్ విక్రయిస్తూ అష్వక్, షిరోజ్ బేగూరు పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు.

వైజాగ్ టూ బెంగళూరు
పోలీసుల విచారణలో అష్వక్, షిరోజ్ షాకింగ్ విషయాలు బయటకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం నుంచి రైలులో ఐటీ హబ్ కు గప్ చుప్ గా ఎవ్వరికి ఎలాంటి డౌట్ రాకుండా కోట్ల రూపాయల విలువైన హ్యాశిష్ ఆయిల్ డ్రగ్స్ బెంగళూరుకు తీసుకువచ్చి విక్రయిస్తున్నామని అష్వక్, షిరోజ్ చెప్పడంతో బెంగళూరు పోలీసులు షాక్ అయ్యారు.

రూ. 1.6 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
నిందితుల నుంచి రూ. 1.6 కోట్ల విలువైన హ్యాశిష్ ఆయిల్ డ్రగ్స్ స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. బెంగళూరులో అమాయకులు, కాలేజ్ స్టూడెంట్స్, ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న కొందరు యువకులు, శ్రీమంతులను టార్గెట్ చేసుకుని వారికి డ్రగ్స్ అలవాటు అయ్యేలా నిందితులు ప్రయత్నించారని, ఇలా డ్రగ్స్ విక్రయించి ఎలాంటి కష్టం లేకుండా డబ్బులు సంపాధిస్తున్నారని, అష్వక్, షిరోజ్ తో ఇంకా ఎంతమందికి లింక్ ఉందో ఆరా తీస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications