తరుణ్ తేజ్‌పాల్‌పై అభియోగాలు నమోదు చేయాలి: కోర్టు
పనాజీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. తేజ్‌పాల్‌పై అభియోగాలు నమోదు చేయాలని గోవా కోర్టు గురువారం నాడు ఆదేశించింది.
ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 28వ, తేదికి వాయిదా వేసింది కోర్టు. కోర్టు ఆదేశాలపై తరుణ్ తేజ్‌పాల్ న్యాయవాది మాత్రం ఈ కేసు ఫైనల్ చార్జీ షీట్‌లో 376 సెక్షన్ లేదన్నారు.

తన వద్ద పనిచేసే మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తరుణ్‌తేజ్‌పాల్‌పై కేసు నమోదైంది. గోవాలోని ఓ హోటల్‌లో తరుణ్ తేజ్‌పాల్ లైంగిక దాడికి పాల్పడ్డారని అదే సంస్థలో పనిచేసిన జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలు అప్పట్లో సంచలనం కల్గించాయి. హోటల్‌లోని లిఫ్టులోకి లాగి తేజ్‌పాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ సోమా చౌదురీకి ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications