వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైమ్ కావాలన్న తరుణ్: ఇచ్చేది లేదన్న పోలీసులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గోవా పోలీసుల ముందు హజరయ్యేందుకు తనకు కొంత సమయం కావాలని మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడిన తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ పోలీసులను కోరారు. గురువారం మధ్యాహ్నం 3గంటల వరకు తమ ముందు హాజరు కావాలని గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం సమన్లు జారీ చేసిన నేపథ్యంలో తరుణ్ తేజ్‌పాల్ పైవిధంగా స్పందించారు.

తమ ముందు శనివారం సాయంత్రం హాజరవుతానని తరుణ్ తేజ్‌పాల్ గోవా పోలీసులకు ఓ లేఖ రాశారని తరుణ్ తేజ్‌పాల్ తరపు న్యాయవాది సందీప్ కపూర్ తెలిపారు. తాను గోవా పోలీసుల విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాని తరుణ్ తేజ్‌పాల్ తన లేఖలో పేర్కొన్నారు. కేసు విషయంలో ఉపశమనం పొందేందుకు తరుణ్ తేజ్‌పాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించే ఆలోచనలో లేరని ఆయన తరపు న్యాయవాది సందీప్ కపూర్ తెలిపారు.

Tarun Tejpal

తరుణ్ తేజ్‌పాల్ గురువారం తమ ముందు హాజరవుతాడని గోవా పోలీసులు భావించినప్పటికీ అతనికి పోలీసులు జారీ చేసినట్లు సమన్లు గురువారం ఉదయం అందినట్లు సమాచారం. అందువల్ల తాను పోలీసుల ముందు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని తరుణ్ తేజ్‌పాల్ కోరినట్లు రాష్ట్ర డిజిపి కిషన్ కుమార్ తెలిపారు. అయితే గోవా పోలీసులు తరుణ్ తేజ్‌పాల్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ ఏమైనా జారీ చేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

నిందితునికి సహకరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కాగా బుధవారం ఉదయం గోవాకు వచ్చిన బాధితురాలు మేజిస్ట్రేట్ ముందు తన వాదనలను వినిపించింది. తేజ్‌పాల్ తనపై వేధింపులకు పాల్పడిన నాటి నుంచి తేజ్‌పాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు జరిగిన పరిణామాలను మొత్తం బాధితురాలు వివరించినట్లు సమాచారం.

నవంబర్ మొదటివారంలో గోవాలోని ఓ హోటల్‌లోని లిఫ్టులో మహిళా జర్నలిస్టును తేజ్‌పాల్ లైంగికంగా వేధించారనే అభియోగంపై గోవా పోలీసులు నవంబర్ 22న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా తనను కావాలనే బిజెపి ప్రభుత్వం కావాలనే కేసులో ఇరికించిందని తరుణ్ తేజ్‌పాల్ చేసిన ఆరోపణలను గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కొట్టిపారేశారు. తన ఆరోపణలను నిరూపించుకోవాలని తరుణ్ తేజ్‌పాల్‌కు ఆయన సవాల్ విసిరారు.

తరుణ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

గోవా పోలీసులు గురువారం తరుణ్ తేజ్‌పాల్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తనకు సమయం కావాలన్న తరుణ్ తేజ్‌పాల్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన గోవా పోలీసులు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంటును జారీ చేశారు. కాగా తనకు అంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం తరుణ్ తేజ్‌పాల్ ఉపసంహరించుకున్నారు. కేసు పరిష్కారం కోసం తాను సరైన కోర్టును ఆశ్రయిస్తానని తరుణ్ తేజ్‌పాల్ హైకోర్టుకు తెలిపినట్లు సమాచారం.

English summary
Tehelka editor Tarun Tejpal, who was asked to appear before the Goa Police by 3pm on Thursday, has sought more time to present himself before the crime branch investigating the alleged sexual assault by him against a woman journalist colleague earlier this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X