వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాటాల చేతికి ఎయిర్ ఇండియా- 69 ఏళ్ల తర్వాత-వరల్డ్ క్లాస్ గా మారుస్తామన్న ఛైర్మన్ చంద్రశేఖరన్

|
Google Oneindia TeluguNews

నష్టాల ఊబిలో చిక్కుకుని సతమతం అవుతూ కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణకు దారితీసిన ఎయిర్ ఇండియా విజయవంతంగా తిరిగి టాటాల చేతుల్లోకి వెళ్లింది. ఇవాళ అధికారికంగా ఈ ప్రక్రియకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీంతో 69 ఏళ్ల క్రితం మహారాజా ఎయిర్ లైన్స్ గా టాటాల చేతుల్లో నుంచి ప్రభుత్వానికి వెళ్లిన విమానయాన సంస్ధ కాస్తా తిరిగి ఎయిర్ ఇండియాగా సొంతగూటికి చేరింది. దీన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ లైన్స్ గా తీర్చిదిద్దుతామని టాటా సంస్ధ ప్రకటించింది.

 టాటాలకు ఎయిర్ ఇండియా అప్పగింత

టాటాలకు ఎయిర్ ఇండియా అప్పగింత

ఒకప్పుడు దేశంలోనే తొలి విమానయాన సంస్ధగా పేరుగాంచిన టాటాలకు చెందిన మహారాజా ఎయిర్ లైన్స్ కాలక్రమంలో ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. తిరిగి 69 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వం దీన్ని నిర్వహించలేమని చేతులెత్తేయడంతో తిరిగి సొంత గూటికి చేరిపోయింది. నష్టాల ఊబిలో చిక్కుకున్న ఎయిర్ ఇండియాను నడిపించే పరిస్ధితి లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణలో భాగంగా దీన్ని తిరిగి దాని మాజీ యజమాని టాటాలకు ఇవాళ అదికారంగా అప్పగించేసింది. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి టాటా నిర్వాహకులు దీన్ని చేతుల్లోకి తీసుకున్నారు.

బదిలీ ప్రక్రియ ఇలా

బదిలీ ప్రక్రియ ఇలా


కేంద్రం చేతుల్లో ఉన్న ఎయిర్ ఇండియా ఇప్పుడు తాజా నిర్ణయంతో టాటాల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో దీని నిర్వహణ నియంత్రణతో పాటు ఎయిర్ ఇండియాకు ఉన్న 100 శాతం షేర్లను తలాస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదిలీ చేయడంతో ఎయిర్ ఇండియా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఇవాళ విజయవంతంగా ముగిసిటన్లయింది. వ్యూహాత్మక భాగస్వామి నేతృత్వంలోని కొత్త బోర్డు ఎయిర్ ఇండియా బాధ్యతలు తీసుకుంటుందని అధికారులు ప్రకటించారు.
ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను సకాలంలో విజయవంతంగా ముగించడం నిజంగా విశేషమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.

Recommended Video

5G టెక్నాలజీ Airline Safety కి పెనుముప్పా ? | Air India | Oneindia Telugu
వరల్డ్ క్లాస్ గా తీర్చిదిద్దుతామన్న టాటా ఛైర్మన్

వరల్డ్ క్లాస్ గా తీర్చిదిద్దుతామన్న టాటా ఛైర్మన్

ఎయిర్ ఇండియా తిరిగి టాటా గ్రూప్ చేతుల్లోకి రావడంపై ఛైర్మన్ చంద్రశేఖరన్ సంతోషం వ్యక్తం చేశారు. "ఎయిరిండియాను తిరిగి టాటా గ్రూప్‌లో చేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ శ్రేణి విమానయాన సంస్థను రూపొందించడంలో అందరితో కలిసి పనిచేయాలని మేము ఎదురుచూస్తున్నాము'' అని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. యాజమాన్య బదలాయింపు ప్రక్రియకు ముందు ప్రధాని మోడీతో సమావేశమైన ఆయన.. దీన్ని ప్రపంచ శ్రేణి సంస్ధగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారంతో కృషి చేస్తామన్నారు.

English summary
Air India has finally returned to Tata fold on today, marking it a successful start to Narendra Modi government’s privatisation programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X