
ఎయిర్ ఇండియా చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్.. మరో కీలక పదవీ అప్పగింత
ఎయిర్ ఇండియా టాటాల ఆధీనంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరీ దాని కార్యకలాపాలు ఎలా.. దీనికి టాటా కంపెనీ పరిష్కారం తెలిపింది. తమ సంస్థలో కీలకమైన వ్యక్తి ఎన్ చంద్రశేఖర్‌కు ఆ బాధ్యతలను అప్పగించింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంతకుముందు టర్కీకి చెందిన లైకర్ ఆయసీ పేరు కూడా వినిపించింది. అయితే దానిపై దేశంలో చాలా వ్యతిరేకత వచ్చింది. అందుకోసమే వెనక్కి తగ్గింది.
ప్రస్తుతం ఎన్ చంద్రశేఖరన్ టాటా సన్స్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇందులో దాదాపు 100 చిన్న కంపెనీలు మిళితం అయి ఉన్నాయి. టాటా సన్స్ బోర్డులో చంద్రశేఖరన్ 2016 అక్టోబర్‌లో చేరారు. 2017 జనవరిలో చైర్మన్‌గా నియమితులు అయ్యారు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, టీసీఎస్ చీఫ్‌గా ఆయన పనిచేశారు. 2009 నుంచి 2017 వరకు ఆయా కంపెనీలకు బాస్‌గా పనిచేశారు. టీసీఎస్‌లో 30 ఏళ్లు పనిచేసిన తర్వాత.. చైర్మన్ పదవీ చేపట్టారు. సీఈవో, ఎండీ పదవులు చేపట్టారు. చంద్రశేఖరన్.. తొలి నాన్ పార్సీ, టాటాలో పార్సీ తప్ప మిగతా వారు అత్యున్నత పదవీ చేపట్టడం అరుదు.

ఎన్ చంద్రశేఖరన్ పదవీకాలాన్ని ఐదేళ్లపాటు పొడిగిస్తూ టాటా సన్స్ బోర్డు నిర్ణయం తీసుకుంది. చంద్రశేఖరన్ తొలిసారిగా 2017లో టాటా సన్స్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం ఫిబ్రవరి 20తో ముగియనుంది. కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో, "టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఎమిరేట్స్ చైర్మన్ మరియు టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా కూడా పాల్గొన్నారు. ఎన్ చంద్రశేఖరన్ నేతృత్వంలోని టాటా గ్రూప్ పురోగతి మరియు పనితీరుపై రతన్ టాటా సంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించాలని రతన్ టాటా సిఫార్సు చేశారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ పదవీకాలాన్ని బోర్డు సభ్యులు కూడా ప్రశంసించారు. తదుపరి 5 సంవత్సరాలకు అతనిడి పునర్నియామకాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. శుక్రవారం అలా జరగగా.. సోమవారం కీలక బాధ్యతలను అప్పగించారు.