టాటా స్టీల్: ‘కోవిడ్‌తో చనిపోయిన ఉద్యోగులకూ జీతాలు ఇస్తాం, వారి కుటుంబాల వైద్య ఖర్చులు భరిస్తాం’

భారత్‌లో కోవిడ్-19తో మరణించిన తమ ఉద్యోగుల కుటుంబాలకు పరిహారాన్ని అందిస్తామని టాటా స్టీల్ ప్రకటించింది.
మరణించిన తమ ఉద్యోగులకు 60 ఏళ్లు వచ్చేవరకు వారి కుటుంబాలకు జీతాలు అందిస్తామని, వైద్య ఖర్చులు కూడా భరిస్తామని సంస్థ పేర్కొంది.
మరణించిన ఫ్రంట్‌లైన్ వర్కర్ల పిల్లల చదువుకు అయ్యే ఖర్చును భరిస్తామని ఇదివరకే సంస్థ ప్రకటించింది.
ఈ వారంతో భారత్‌లో కోవిడ్ మరణాల సంఖ్య మూడు లక్షలకు చేరింది. అయితే వాస్తవానికి మరణాలు దీని కంటే చాలా ఎక్కువే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
''ప్రాణాంతక మహమ్మారి విజృంభణతో ప్రాణాలు కోల్పోయిన తమ ఉద్యోగుల కుటుంబాలకు టాటా స్టీల్ అండగా నిలుస్తుంది’’అని సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఉద్యోగులకు సంస్థ అందించే సామాజిక భద్రతా పథకాలను సవివరంగా ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులు, వారికి కుటుంబాల సంరక్షణకు టాటా స్టీల్ కట్టుబడి ఉందని వివరించారు.
https://twitter.com/TataSteelLtd/status/1396345034878840835
కోవిడ్-19తో మరణించిన తమ ఉద్యోగులకు సాయం అందిస్తామని ప్రకటించిన ప్రధాన భారత సంస్థల్లో టాటా స్టీల్ కూడా ఒకటి.
గత వారం ''ఓయో రూమ్స్’’ కూడా కోవిడ్-19తో మరణించిన తమ ఉద్యోగులకు ఎనిమిది నెలల జీతం ఇస్తామని, ఐదేళ్లపాటు వారి పిల్లల చదువుకు అయ్యే ఖర్చు భరిస్తామని పేర్కొంది.
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- క్వినైన్: ప్రపంచ పటాన్ని మార్చిన మొక్క ఇది - ఎలా మార్చింది.. చరిత్రలో ఏం జరిగింది?

''కోవిడ్‌పై పోరాటం ముగియడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఇలాంటి కష్ట సమయాల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు మా సాయం కొంతవరకు ఉపయోగపడుతుంది’’అని సంస్థ ఫౌండర్ రితేశ్ అగర్వాల్ ట్వీట్ చేశారు.
ఈ నెల మొదట్లో గ్లాస్ తయారీ సంస్థ బోరోసిల్ కూడా ఇలాంటి సాయాన్నే ప్రకటించింది. కోవిడ్‌తో మరణించిన తమ ఉద్యోగులకు రెండేళ్లపాటు జీతం ఇస్తామని తెలిపింది.
దీనిపై బోరోసిల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీవర్ ఖెరుకా లింకిడ్‌ఇన్‌లో ఓ పోస్ట్ చేశారు. మరణించిన తమ ఉద్యోగుల పిల్లల చదువును తామే భరిస్తామని చెప్పారు.
కోవిడ్‌తో భారీగా ప్రాణనష్టంతోపాటు ఆర్థిక నష్టం కూడా సంభవిస్తున్న నేపథ్యంలో సంస్థలు తాజా ప్రకటనలు చేస్తున్నాయి.
గత కొన్ని వారాలుగా భారత్‌లో కోవిడ్ రెండో వేవ్ విజృంభిస్తోంది. రోగులతో కిక్కిరిసిపోతున్న హాస్పిటళ్లు చాలా మంది రోగులను వెనక్కి పంపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్, అత్యవసర మందులు అడుగంటిపోతున్నాయి. శ్మశానాల్లో కూడా చోటు సరిపోవడం లేదు.
మూడు లక్షలకుపైగా మరణాలు సంభవించిన మూడో దేశంగా ఈ వారం భారత్ మారింది. అమెరికా, బ్రెజిల్ ఈ మార్కును ఎప్పుడో దాటేశాయి.
భారత్‌లో మొత్తంగా 2.6 కోట్ల కేసులు నమోదుఅయ్యాయి. మొత్తం కేసుల్లో అమెరికా తర్వాతి స్థానం భారత్‌దే
ఇవి కూడా చదవండి:
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన 'బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications