వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coal Crisis : ప‌వ‌ర్ బ్యాక‌ప్ వ్య‌వ‌స్థ‌లు సిద్దం చేసుకోండి - ఉద్యోగులకు ఐటీ దిగ్గ‌జ కంపెనీల అలర్ట్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

కేంద్రం బొగ్గు కొరత లేదని చెబుతోంది. అనేక రాష్ట్రాల్లో మాత్రం విద్యుత్ కోతలు కంటిన్యూ అవుతున్నాయి. బొగ్గు సరఫరా లేక అనేక నగరాల్లోనూ విద్యుత్ కోతలు అమలు అవుతున్నాయి. దీంతో..ముఖ్యంగా ప్రముఖ ఐటీ కంపెనీల ఈ సమస్య తో అప్రమత్తం అవుతున్నాయి. తాజాగా..టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్ త‌మ ఉద్యోగుల‌కు దిశా నిర్దేశం చేశాయి. కీల‌క ప్రాజెక్టులను చేప‌డుతున్న స‌మయంలో అంత‌రాయం క‌లుగ‌కుండా ప‌వ‌ర్ బ్యాక‌ప్ వ్య‌వ‌స్థ‌లు ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించాయి.

బొగ్గుకొర‌త వార్త‌లు దేశీయ‌, అంత‌ర్జాతీయ మీడియాల్లో ప‌తాక శీర్షిక‌ల‌కెక్క‌డంతో క్ల‌యింట్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని పేర్కొన్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వాలు లోడ్ షెడ్డింగ్ కొనసాగిస్తామ‌ని ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు జారీచేస్తే, సిబ్బంది.. ప‌వ‌ర్ బ్యాక‌ప్ వ్య‌వ‌స్థ‌లు ఏర్పాటు చేసుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని త‌మ సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌ల‌కు ఈ-మెయిల్స్ పంపాయి. గత ఏడాది కరోనా ఆరంభం నుంచి చిన్న కంపెనీల మోదలు దిగ్గజ ఐటీ సంస్థల వరకు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించారు.

TCS and Infosys sent emails to their senior executives asking them to prepare electricity backups

దాదాపుగా 90 శాతం ఐటీ ప్రొఫెనల్స్ అప్పటి నుంచి వర్క్ ఫ్రం సేవలందిస్తున్నారు. తాజాగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. కొన్ని రాష్ట్రాలు లోడ్ షెడ్డింగ్ చేస్తూ విద్యుత్ ను విక్రయాలు సాగిస్తున్నాయని.. ఇటువంటివి అంగీకరిచమని తేల్చి చెప్పింది. అదే సమయంలో ఎవరికీ కేటాయించని విద్యుత్ ను వినియోగించుకోవటానికి అనుమతులు ఇచ్చింది. దేశంలో బొగ్గు కొరత లేదని కేంద్ర మంత్రులు పదే పదే చెబుతున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కేంద్ర వాదనతో విభేదిస్తున్నారు.

కేంద్ర విద్యుత్‌శాఖ కార్య‌ద‌ర్శి అలోక్‌కుమార్ స్పందిస్తూ బొగ్గు కొర‌త‌వ‌ల్ల విద్యుత్ ఉత్ప‌త్త జ‌రుగ‌డం లేద‌న్న వార్త‌ల‌ను తోసిపుచ్చారు. కొద్ది రోజులుగా పంజాబ్‌, మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్‌, హ‌ర్యానా రాష్ట్ర ప్ర‌భుత్వాలు కొన్ని రోజులుగా లోడ్ షెడ్డింగ్ ప‌నులు పున‌రుద్ధ‌రిస్తున్నాయి. కేంద్ర‌ప్ర‌భుత్వం కూడా రాష్ట్రాల‌కు స‌రిపడా బొగ్గు స‌ర‌ఫ‌రా చేయ‌డానికి చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసింది. విద్యుత్..బొగ్గు..రైల్వే శాఖలతో కలిపి ఏర్పాటు చేసిన టీం ఇప్పటి పరిస్థితుల పైన అసవరమైన చర్యలు తీసుకుంటోంది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ తమకు విద్యుత్ కోతలు అనే అవసరమే రాదని స్పష్టం చేసింది.

కాగా, ఏపీ ముఖ్యమంత్రి తాజాగా అధికారులకు ఉత్తర్వులు జారీ చేసారు. నిధుల కొరత లేదని..కోతలు లేకుండా విద్యుత్ సరఫరా కోసం ఎక్కడ అందుబాటులో ఉన్నా కొనుగోలు చేయాలని ఆదేశించారు. కేంద్రం నుంచి నిత్యం 20 రేక్ లు బొగ్గు సరఫరా చేయాలని కోరారు. అయితే, ఇప్పుడు ఈ ప్రముఖ ఐటీ సంస్థలకు చెందిన ఉద్యోగులు అనేక రాష్ట్రాల్లో ఉంటంతో ఆ సంస్థల యాజమన్యాలు ముందుగానే వారిని అలర్ట్ చేస్తున్నాయి.

English summary
TCS and Infosys have asked senior employees to prepare for power back in order to avoid disruption to key projects amid blackouts in several states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X