ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు టీసీఎస్ ఉద్యోగి కుట్ర !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మెడీతో సహా సహా పలువురు రాజకీయ నాయకులను హతమార్చేందుకు కుట్ర పన్పిన అల్ ఖైదా ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. అయితే అరెస్టు అయిన వారిలో గ్యాంగ్ లీడర్ దావూద్ సులేమాన్ టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌(టెక్కీ)గా పనిచేస్తున్నాడు.

దావూద్ సులేమాన్ మదురైకి చెందిన వాడు. ప్రస్తుతం ఇతను చెన్నై లోని తిరువన్మియూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతడితో పాటు పెయింట్ పని చేస్తున్న అబ్బాస్ అలీ, చికెన్ సెంటర్ లో పనిచేస్తున్నశ్యామ్ సమ్ కరీమ్ రజా అనే ఇద్దరూ అరెస్టయ్యారు.

TCS techie who plotted to target PM Modi held in Tamil Nadu

వీళ్లంతా అల్‌ ఖైదా స్ఫూర్తితో మొత్తం దేశంలోని వివిధ రాష్ట్ర్రాల్లో ఉన్నవీవీఐపీ నాయకులను హత్య చెయ్యడానికి కుట్రపన్నారు.
ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారులు ఆధారాలతో సహా గుర్తించారు. వీళ్లు తలదాచుకున్న చోట పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముగ్గురిని మదురై, చెన్నై నగరాల్లో అరెస్టు చేశారు. ద బేస్ మూమెంట్ ఆఫ్ అల్ ఖైదా అనే గ్రూపుగా వీళ్లంతా ఒక్కటి అయ్యారని అధికారులు చెప్పారు. వీళ్లందరూ 1998లో తమిళనాడులో నిషేధానికి గురైన అల్ ఉమా ఉగ్రవాద సంస్థ సభ్యులు గా పని చేస్తున్నారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Investigating officers said the suspects, part of a group that called itself The Base Movement of al-Qaida, were former members of alUmmah, an organisation TN had banned in 1998.
Please Wait while comments are loading...