భారతరత్న:వాజపేయి కోసం బిజెపి, ఎన్టీఆర్ కోసం బాబు

తాము అధికారంలోకి వస్తే ఆయనను ఈ పురస్కారంతో ఆయనను సత్కరిస్తామని చెప్పారు. సచిన్,సిఎన్‌ఆర్ రావులకు భారతరత్న ప్రకటించారని, వారిని తాను అభినందిస్తున్నానని అయితే వాజపేయికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదని తాను ఈ రోజు ప్రశ్నిస్తున్నానన్నారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పాటుకు వాజపేయి ఎంతో తోడ్పడ్డారని, అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రధానమంత్రి అని తెలిపారు.
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు మరణానంతరం భారతరత్న ఇవ్వడంపైనా ఆయన మండిపడ్డారు. ‘సర్దార్ పటేల్ ఈ దేశ జాతిరత్నం. ఆయన 1950లో చనిపోతే 1991లో ఆయనకు భారతరత్న ఇచ్చారు. ఈ అవార్డు ఇవ్వడంలో 41ఏళ్లు ఆలస్యం ఎందుకు జరిగింది? ఈమధ్య కాలంలో జవహర్ లాల్ నెహ్రూ 17ఏళ్లు, ఇందిరాగాంధీ 16ఏళ్లు, రాజీవ్ గాంధీ అయిదేళ్లు ప్రధానిగా ఉన్నారు. వాళ్లకే కాదు ఇంకా చాలామందికి భారతరత్న ఇచ్చారు. పటేల్‌కు మాత్రం 41ఏళ్ల తర్వాత ఎందుకు ఇచ్చారు?' అని రవి శంకర్ ప్రశ్నించారు.
కేంద్రానికి చంద్రబాబు లేఖ
ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. భారత చలనచిత్ర, రాజకీయ రంగాల్లో వజ్ర సంకల్పంతో తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడంతోపాటు బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రవేశం కల్పించడంద్వారా సామాజిక చైతన్యం తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే అన్నారు. నలభై నాలుగేళ్ళ సినీ జీవితం, పదమూడేళ్ళ రాజకీయ జీవితాల్లో నాయకునిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడన్నారు. ఈ మేరకు ఆదివారం కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు.
తెలుగు జాతికి, తెలుగు భాషకు దేశవ్యాప్త గుర్తింపు తెచ్చారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ప్రజాభిమానంలో ఇప్పటికీ దేశంలోని నటులందరిలో ప్రధమస్థానాన్ని అధిష్ఠించిన ఎన్టీఆర్ ఘనకీర్తిని పొందారన్నారు. ఒక గొప్ప నటుడు, ప్రజానాయకునిగా ఉన్న ఎన్టీఆర్ తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించడంతోపాటు మరెన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారన్నారు.
ఇక ప్రజాసేవలో భాగంగా ఆస్తిలో స్త్రీలకు వాటా హక్కు చట్టం ఎన్టీఆర్ తెచ్చిందేనని, రాయలసీమ ప్రాంతానికి, తమిళనాడుకు తాగు, సాగు నీటినందించిన విశాల దృక్పథం కలిగిన జాతీయవాది ఎన్టీఆర్ అని, తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలను పీడిస్తున్న పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి వారికి ఆరాధ్య దైవంగా మారారని తెలిపారు. రాయలసీమలో కరవు నెలకొన్న సమయంలో సినీ రంగ ప్రముఖులతో రాష్ట్రమంతటా తిరిగి విరాళాలు సేకరించి తన సేవాతత్పరతను చాటుకున్నారన్నారు.
పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్న ఎన్టీఆర్ రాజకీయరంగంలో ప్రపంచ రికార్డు సృష్టించారన్నారు.
పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారని పేర్కొన్నారు. 1991 లో నంద్యాల లోక్‌సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచిన అప్పటి ప్రధాని పివి నర్సింహరావుకు తెలుగువారి తరపున గౌరవసూచకంగా ఎవరినీ పోటీకి నిలబెట్టకుండా కొత్త సాంప్రదాయాన్ని ఎన్టీఆర్ సృష్టించారని తెలిపారు. తెలుగుజాతికి ఆణిముత్యంలాంటి ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించాలన్న తెలుగువారి అభిలాషను నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications